అనిల్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో కాదా..?

శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ రావిపూడి కామెడీ సీన్స్ ఎలా రాయాలో, కామెడీ సీన్స్ ఎలా తీయాలో బాగా నేర్చుకున్నాడు. అందుకే తన [more]

Update: 2019-02-25 06:22 GMT

శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ రావిపూడి కామెడీ సీన్స్ ఎలా రాయాలో, కామెడీ సీన్స్ ఎలా తీయాలో బాగా నేర్చుకున్నాడు. అందుకే తన సినిమాల్లో కామెడీ బాగా తీస్తాడు. కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ లేటెస్ట్ ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి నెక్స్ట్ ఫిల్మ్ గురించి వార్తలు వస్తున్నాయి.

లేడీ ఓరియెంటెడ్ ఫిలింతో…

అనిల్ తన నెక్స్ట్ మూవీ కోసం అప్పుడే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసాడని… అది కూడా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఐతే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన లేదు. ఈ మ్యాటర్ పక్కన పెడితే అనిల్ ఎఫ్ 2 తరువాత మహేష్ తో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ తో సినిమా లేట్ అయ్యేలా ఉందని ఈ లోపల లేడీ ఓరియంటెడ్ ఫిలిం తీద్దాం అని డిసైడ్ అయ్యాడట.

Tags:    

Similar News