హీరోయిన్స్ కి హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు?

సరిలేరు నీకెవ్వరూ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మల్లి స్టార్ హీరోలకే గేలం వేద్దామనుకుంటే… ఏ ఒక్క హీరో కూడా అందుబాటులో లేకపోవడంతో.. మల్లి తనకి అచ్చొచ్చిన [more]

Update: 2020-04-08 06:05 GMT

సరిలేరు నీకెవ్వరూ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మల్లి స్టార్ హీరోలకే గేలం వేద్దామనుకుంటే… ఏ ఒక్క హీరో కూడా అందుబాటులో లేకపోవడంతో.. మల్లి తనకి అచ్చొచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు. అయితే ఎఫ్ 2 సీక్వెల్ కి అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో ని తీస్కోబోతున్నాడనే టాక్ ఉంది. అది రవితేజ అయినా మరే హీరో అయినా సరే. అయితే వరుణ్ తేజ్, వెంకటేష్ లు కామన్ గా ఎఫ్ 2 నుండి ఎఫ్ 3 కి షిఫ్ట్ అవుతున్నారు.

కానీ అనిల్ రావిపూడి ఈసారి ఎఫ్ 2 హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ కౌర్ లను కంటిన్యూ చెయ్యడం లేదట. కొత్త హీరోయిన్స్ అంటే కాస్త స్టార్ డం ఉన్న హీరోయిన్స్ ని ఎఫ్ 3 కోసం తీసుకోబోతున్నాడట. మరి తమన్నా అనిల్ రావిపూడి కోసం సరిలేరు లో ఐటెం సింగ్ చేసింది. అలంటి తమన్నా ని అనిల్ లైట్ తీసుకుంటాడా? ఇక ఎఫ్ 2 సినెమాలో హీరోలతో పాటుగా ఫ్రస్ట్రేషన్ కాన్సెప్ట్ ని మాత్రమే సీక్వెల్ లో పెడతాడట. ఇక హీరోయిసం ని మాత్రం పక్కనబెట్టి.. కొత్త హీరోయిన్స్ ని తీసుకుంటున్నాడట.. మరి వెంకటేష్ కి హీరోయిన్స్ దొరకడం కష్టము. వరుణ్ తేజ్ క్రేజ్ కి ఏ హీరోయిన్ అయినా సై అంటుంది. సో కొత్త హీరోయిన్స్ ఎఫ్ 3 లో పక్క అన్నమాట.

Tags:    

Similar News