అనిల్ ట్వీట్ తో ఫుల్ ఖుషి

సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఏదొక అప్ డేట్ తో ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ [more]

Update: 2019-10-07 12:26 GMT

సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఏదొక అప్ డేట్ తో ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి ఎటువంటివి కావాలనుకుంటున్నారో అటువంటివి సినిమాలో అందిస్తున్నాం అని అనిల్ స్టార్టింగ్ లోనే చెప్పాడు. ఇక ఆ తరువాత వరసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసి సరిలేరు నీకెవరు సినిమాపై అంచనాలు పెంచేశాడు. లేటెస్ట్ గా మహేష్ ఫ్యాన్స్ కోసం అనిల్ మరో అప్ డేట్ ఇచ్చాడు. కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లే తాము ద‌స‌రాకు స‌రిలేరు నీకెవ్వ‌రు కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు అనిల్ రావిపూడి వెల్ల‌డించాడు. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలానే పోస్టర్ ఉండబోతుందని అనిల్ తన ట్విట్టర్ లో చెప్పాడు. దాంతో అనిల్ ట్వీట్ కింద మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. దసరా కానుకగా అంటే ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల 4 నిమిషాల‌కు ఈ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యింది. మరి ఈ పోస్టర్ సూప‌ర్ స్టార్ అభిమానుల్ని ఎంత‌గా మురిపిస్తుందో చూడాలి.

 

Tags:    

Similar News