ఈ రీమేక్ కి తెలుగుదనం జోడిస్తే.. వర్కౌట్ అవుతుందా?

చాలామంది దర్శకులు వేరే భాషలో హిట్ అయిన సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే… యాజిటీజ్ గా ఆ సినిమాని అలాగే ప్రేక్షకుల మీదికి వదలరు. జస్ట్ హీరో, [more]

Update: 2020-11-05 05:23 GMT

చాలామంది దర్శకులు వేరే భాషలో హిట్ అయిన సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే… యాజిటీజ్ గా ఆ సినిమాని అలాగే ప్రేక్షకుల మీదికి వదలరు. జస్ట్ హీరో, హీరోయిన్ మారడమే కాదు… కథలోనూ చాలా మార్పులు జరుగుతాయి. అందులోను తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టు ఆ రీమేక్స్ ని తెలుగు నేటివిటీకి దగ్గరగా కథలు అల్లుతారు దర్శకులు. కొన్ని రీమేక్స్ విషయంలో అవి వర్కౌట్ అయినా మరికొన్ని సినిమాలకు వర్కౌట్ అవ్వదు. మరి బాలీవుడ్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ అంధధూన్ సినిమాని హీరో నితిన్ రీమేక్ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ లో నెగటివ్ పాత్రలో కనబడిన టబు పాత్రని తమన్నా చేస్తుంటే.. హీరోయిన్ గా రాధికా ఆఫ్టే పాత్రని నభ నటేష్ చేస్తుంది.

మరి బాలీవుడ్ లో టబు బోల్డ్ గా నటించింది. అంటే భర్తని మోసం చేస్తూ వేరే పోలీస్ ఆఫీసర్ తో ఎఫ్ఫైర్ నడుపుతూ భర్తనే చంపేసి.. హీరో ని ముప్పుతిప్పలు పెట్టే పాత్రలో అదిరిపోయే నటన కనబర్చింది. ఇక రాధికా ఆప్టే కూడా చాలా సెక్సీ గా.. గ్లామర్ గా నటించింది. కానీ తెలుగులో అలాంటిదేం లేదని… అంధధూన్ రీమేక్ లో చాలా మార్పులు ఉండబోతున్నాయట. తెలుగు ప్రేక్షకులు నచ్చేలా తన కేరెక్టర్ ఉంటుంది అని నభ నటేష్ కన్ఫర్మ్ చేసేసింది. అంటే తన పాత్ర కి కొన్ని హద్దులుంటాయనేది చెప్పకనే చెప్పింది. ఇక టబు పాత్రని కొద్దిగా మార్చాకే ఆ కేరెక్టర్ లో నటించడానికి తమన్నా కూడా ఒప్పుకుందట. మరి బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన సినిమాకి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఓకె.. లేదంటే సినిమా పక్కదారి పట్టడం ఖాయం.

Tags:    

Similar News