యాంకర్స్ రెమ్యునరేషన్ మాములుగా లేదు

టాలీవుడ్ లో ఉన్న యాంకర్స్ మరే ఇండస్ట్రీలో ఉండరనిపిస్తుంది. టాలీవుడ్ లో ట్రెడిషనల్ యాంకర్స్ ఉన్నారు. కత్తిలాంటి గ్లామర్ ఒలకబోసే యాంకర్స్ ఉన్నారు. టాలీవుడ్ లో సినిమా [more]

Update: 2019-11-13 05:41 GMT

టాలీవుడ్ లో ఉన్న యాంకర్స్ మరే ఇండస్ట్రీలో ఉండరనిపిస్తుంది. టాలీవుడ్ లో ట్రెడిషనల్ యాంకర్స్ ఉన్నారు. కత్తిలాంటి గ్లామర్ ఒలకబోసే యాంకర్స్ ఉన్నారు. టాలీవుడ్ లో సినిమా ఈవెంట్స్ కి, ఆడియో ఫంక్షన్స్ కి, సెలెబ్రిటీ షోస్ కి, టివి ఛానల్స్ ప్రోగ్రామ్స్ కి పనిచేసే యాంకర్స్ హీరోయిన్స్ కి తక్కువ, ఐటెం భామలకు ఎక్కువ అన్న రేంజ్ లో అందాల ఆరబోస్తారు. సుమ, ఝాన్సీ, లాంటి యాంకర్స్ కాస్త ట్రెడిషన్ చూపిస్తే అనసూయ, రష్మీ, మంజూష, శ్యామల, శ్రీముఖి లాంటి యాంకర్స్ అందాలు ఒలకబోస్తూ అదరగొట్టేస్తున్నారు. ఈ హాట్ అండ్ క్రేజీ యాంకర్స్ తాము చేసే ఈవెంట్స్ కి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. మలయాళం నుండి వచ్చి తెలుగు యాంకర్స్ అందరిని ఓ పక్కన నిలబెట్టి టాప్ పొజిషన్ లో నిలబడిన సుమ యాంకరింగ్ కి ఒక్కో ఈవెంట్ కి 2 నుండి రెండున్నర లక్షల్లో పారితోషకం ఇచ్చుకుంటున్నారట. ఆడియో ఫంక్షన్ కి ఒక రేటు, సినిమా అవార్డ్స్ కి ఒక రేటు, టివి ఛానల్ కి ఒక రేటు. ఆ రేంజ్ పారితోషకంతో సుమ కనకాల ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఇక నెక్స్ట్ ప్లేస్ లో యాంకరింగ్ ప్రపంచంలో గ్లామర్ ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్లామర్ భామ అనసూయ ఉంది. అవార్డ్స్ ఫంక్షన్స్ కి యాంకరింగ్ పెద్దగా చెయ్యని అనసూయ జబర్దస్త్ షో తో పాటుగా… మరికొన్ని షోస్ చేసే అనసూయ ఒక్కో ఈవెంట్ కి 2 లక్షల పారితోషకం అందుకుంటుంది. ఇక ఆ నెక్స్ట్ ప్లేస్ జబర్దస్త్ రష్మిదే. అనసూయ తర్వాతి అంత అందాన్ని చూపిస్తున్న రష్మీ కూడా ఒక్కో ప్రోగ్రాం కి లక్షన్నర చొప్పున ఛార్జ్ చేస్తుంటే… ఆడియో వేడులకి వేదికగా మారిన మంజూష ఒక్కో ఈవెంట్ కి 50 వేల చొప్పున ఛార్జ్ చేస్తుందట. ఇక శ్యామల రెమ్యునరేషన్ కూడా పర్లేదు. ఇక ఇప్పటివరకు పటాస్, జీ తెలుగు ఛానల్ షోస్ తో బిజీ అయినా శ్రీముఖి కూడా బిగ్ బాస్ తర్వాత ఫుల్ క్రేజ్ తో తన దగ్గరికి వచ్చిన ఛానల్ ప్రొడ్యూసర్స్ ని భారీగానే డిమాండ్ చెయ్యడం మొదలెట్టిందట.

Tags:    

Similar News