అల్లు అర్జున్ ని అల్లాడించిన యాంకర్?

  అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సాంగ్స్ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్స్. యూట్యూబ్ లో అల వైకుంఠపురములో సాంగ్స్ ఇంకా రీకార్డులు కొల్లగొడుతూనే ఉన్నాయి. [more]

Update: 2020-04-07 09:13 GMT

 

అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సాంగ్స్ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్స్. యూట్యూబ్ లో అల వైకుంఠపురములో సాంగ్స్ ఇంకా రీకార్డులు కొల్లగొడుతూనే ఉన్నాయి. బుట్ట బొమ్మా, సామజవరాగమనా, రాములో రాముల సాంగ్స్ ఇంకా రికార్డులు కొల్లగొడుతుంటే… అల్లు అర్జున్ కే సవాల్ విసురుతున్నాడు యాంకర్ ప్రదీప్. యాంకర్ గా బుల్లితెర మీద అదరగొడుతున్న ప్రదీప్ హీరోగా ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తెరకెక్కింది. కరోనా కారణంగా లాక్ డౌన్ లేకపోతె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలైపోవాలి….కానీ వాయిదా పడింది.

అయితే ప్రదీప్ నటించిన ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ ఆలపించిన నీలి నీలి ఆకాశం సాంగ్ 10 కోట్ల వ్యూస్‌తో ఔరా అనిపిస్తుంది. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ విడుదలైనప్పటినుండి ట్రేండింగ్ లోనే ఉంది. మరి చిన్న సినిమా, కొత్త హీరో అయినప్పటికీ సాంగ్ లోని దమ్ము, సిద్ శ్రీరామ్ గొంతు వెరసి నీలి నీలి ఆకాశం సాంగ్ యూట్యూబ్ లో అదరగొట్టేస్తుంది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సాంగ్స్ తో పాటుగా యాంకర్ ప్రదీప్ నటించిన ఈ సాంగ్ ని ప్రేక్షకులు ఆదరించడమానేది మాములు విషయం కాదు., ఇక అల్లు అర్జున్ యాంటీ ఫాన్స్ అయితే అల్లు అర్జున్ ని అల్లడిస్తున్న యాంకర్ అంటూ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాడు. మరి ప్రదీప్ యాక్టింగ్, సిద్ శ్రీరామ్ అద్భుతమైన గొంతు, అనూప్ రూబెన్స్ సంగీతం అన్ని కలిపి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సాంగ్ ఇలాంటిది అద్భుతం సృష్టించింది.

Tags:    

Similar News