అందుకే బిగ్ బాస్ కు వెళ్లలేదట

బుల్లితెర సెన్సేషన్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోస్ తోను సినిమాలోనూ వరసగా రాణిస్తుంది. రంగస్థలం సినిమాతో తన నటిని బయటికి తీసిన అనసూయ నటిస్తున్న [more]

Update: 2019-08-09 05:51 GMT

బుల్లితెర సెన్సేషన్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోస్ తోను సినిమాలోనూ వరసగా రాణిస్తుంది. రంగస్థలం సినిమాతో తన నటిని బయటికి తీసిన అనసూయ నటిస్తున్న సినిమాలపై కొంచం ఉంది. అయితే రీసెంట్ గా ఆమె మెయిన్ లీడ్ లో ‘కథనం’ అనే సినిమా రూపొందింది.

చూస్తుంటాను కాని…..

ఈమూవీ ఈరోజే రిలీజ్ కానుంది. ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమా ప్రమోషన్స్ భాగంగా అనసూయ ఓ ఇంటర్వ్యూ లో ‘బిగ్ బాస్’ గురించి ప్రస్తావించింది. తాను అప్పుడడిప్పుడు బిగ్ బాస్ షో చూస్తుంటాను అని ఇప్పుడు హౌస్ లో ఉన్న అందరు నాకు బాగా తెలిసిన వల్లే అని చెప్పింది.

ఆఫర్ వచ్చినా…..

నాకు బిగ్ బాస్ షో నుండి ఆఫర్ రావడం వాస్తమే అని కానీ నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను అని అంటుంది అనసూయ. ఎందుకంటే నేను ఫామిలీ ని వదిలేసి అన్నేసి రోజులు ఉండలేను. ఫ్యామిలీ ని వదిలేసి అన్ని రోజులు ఉండాలంటే చాలా దైర్యం కావాలి. నేను షూటింగ్ బయటకి వెళ్తే రోజుకి రెండుమూడు సార్లు అయినా వీడియో కాల్ చేస్తుంటా. అందుకే బిగ్ బాస్ నాకు సెట్ కాదని వదిలేసా అని చెప్పుకొచ్చింది అనసూయ.

Tags:    

Similar News