ఇంత చిన్న పాత్రకే టెంప్ట్ అయ్యిందా?

హాట్ యాంకర్ అనసూయ కి వెండితెర మీద వెలిగిపోవాలని కోరిక. అందుకే అనసూయ ఎపుడూ గ్లామర్ గా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. [more]

Update: 2019-11-02 10:20 GMT

హాట్ యాంకర్ అనసూయ కి వెండితెర మీద వెలిగిపోవాలని కోరిక. అందుకే అనసూయ ఎపుడూ గ్లామర్ గా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. గ్లామర్ డ్రెస్సులతో, గ్లామరస్ హాటెస్ట్ ఫోజుల్తో బుల్లితెర మీద వెలిగిపోతున్నట్లుగా అనసూయ కి వెండితెర మీద బ్రేకిచ్చే పాత్ర కోసం ఎదురు చూస్తుంది. అయితే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం వెయిట్ చేస్తున్న అనసూయకు అప్పుడప్పుడు అలాంటి పాత్రలే తగులుతున్నాయి. రంగస్థలం, క్షణం లాంటి చిత్రాల్లాలో అనసూయ నటన అదుర్స్. అయితే మల్లి అలాంటి అద్భుతమైన అవకాశం మాత్రం అనసూయకి రాలేదు. అందుకే ఐటెం సాంగ్ లలో చిన్న పాత్రలకే అనసూయ టెంప్ట్ అవుతుందనిపిస్తుంది.

ఎందుకంటే తాజాగా విడుదలైన మీకు మత్రమే చెప్తా సినిమాలో అనసూయ చాలా చిన్న పాత్రలో మెరిసింది. సంయుక్త పాత్రలో అనసూయ కేరెక్టర్ పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్టుగా అనిపించదు. అయితే ఉన్నంతలో ఓకె అన్నట్టుగా ఉంది అనసూయ. లుక్స్ పరంగా బావున్నప్పటికీ.. ఇంత చిన్న పాత్రకి అనసూయ టెంప్ట్ అవడమేమిటా అనిపించక మానదు. ఎందుకంటే మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్స్ లో అనసూయ చేసిన హడావిడికి ఆమెని సినిమాలో ఏ మెయిన్ రోల్ కో తీసుకోబట్టి.. అలా ప్రమోషన్స్ లో పాల్గొంటుందని అనుకున్నారు. తీరా సినిమా చూసాక గాని అనసూయ కేరెక్టర్ ఏమిటో తెలియలేదు. మరి అనసూయ ఇలా సినిమాలలో చిన్న చిన్న కీ రోల్స్ కి మాత్రమే పరిమితమవుతుంది. ఇక చిరంజీవి – కొరటాల సినిమాలో అనసూయ ఉందనే ప్రచారం జరుగుతుంది. మరి ఆ సినిమాలో అనసూయ ఎలాంటి కేరెక్టర్ వేస్తుందో చూడాలి.

Tags:    

Similar News