రవితేజతో గొడవపడుతున్న జబర్దస్త్ హాటీ!

రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంశలు అందుకున్న అనసూయ.. ప్రతి వారం జబర్దస్త్ లో కుర్రకారుని కవ్విస్తూనే ఉంది. అయితే అనసూయ సినిమాల ఎంపిక లో మాత్రం [more]

Update: 2020-12-17 08:58 GMT

రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంశలు అందుకున్న అనసూయ.. ప్రతి వారం జబర్దస్త్ లో కుర్రకారుని కవ్విస్తూనే ఉంది. అయితే అనసూయ సినిమాల ఎంపిక లో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. విశేషం ఏమిటంటే.. సినిమాల ఎంపికలో ఇంత సెలెక్టీవ్ గా ఉండే అనసూయ రీసెంట్ గా రవితేజ సినిమాకి మాత్రం సింగిల్ సిట్టింగ్ లో ఇమ్మిడియట్ గా ఓకె చెప్పేసి నెక్స్ట్ డే లొకేషన్ కి కూడా వెళ్లిపోవడం జరిగిందట. మాస్ మహారాజ రవితేజా – రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో అనసూయ కీలక పాత్ర చెయ్యడానికి ఇమ్మిడియట్ గా ఓకె చెప్పిందట.

అయితే రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ ఒప్పుకున్న ఆ కీలక పాత్ర అల్లాటప్పా పాత్ర కాదని.. రవితేజ పాత్రతో అనసూయ పాత్ర ఢీ అంటే ఢీ అనే పాత్ర అని, రవితేజ – అనసూయ  మధ్యన హోరాహోరి ఫైట్ ఉండబోతుందని టాక్. అందుకే అనసూయ ఈ పాత్రకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. రంగంలోకి దిగిపోయిందేమో.. దీనిని బట్టి అనసూయ రవితేజ సినిమాలో పక్కాగా నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర చేస్తుందని ప్రేక్షకులు ఓ అవగాహనకు వచ్చినా రావొచ్చు

Tags:    

Similar News