‘యాత్ర’ అనసూయ పాత్ర ఆమెదే..!

జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ అతి తక్కువ కాలంలోనే వెండితెర మీద తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్ లో అదరగొడుతూ.. రంగస్థలంలో [more]

Update: 2019-01-19 07:22 GMT

జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ అతి తక్కువ కాలంలోనే వెండితెర మీద తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్ లో అదరగొడుతూ.. రంగస్థలంలో రంగమ్మత్తగా తన టాలెంట్ ని బయటపెట్టిన అనసూయ క్షణం సినిమాలో నెగెటివ్ పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీసింది. ఇక తాజాగా ఎఫ్ 2లో అదరగొట్టే ఐటెంలో రెచ్చిపోయిన ఈ హాట్ యాంకర్ విడుదలకు సిద్ధమవుతున్న యాత్ర సినిమాలో ఒక కీలకపాత్రలో నటించింది.

గౌరు చరితారెడ్డి పాత్రలో…

అయితే ఇప్పటివరకు అనసూయ యాత్ర సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందనేది బయటికి రాకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సస్పెన్స్ కి తెర పడింది. మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న యాత్ర సినిమాలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపిస్తూ అందరినీ మెప్పించాడు. ఇప్పటికే విడుదలైన యాత్ర ట్రైలర్ లో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డిగా ఆకట్టుకున్నాడు. అయితే యాంకర్ అనసూయ యాత్ర సినిమాలో కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాత్రలో నటిస్తుంది.

పాదయాత్ర సమయంలో…

వైఎస్సార్ పాదయాత్ర సమయంలో 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజకవర్గం నుండి పోటీచేసిన చరితా రెడ్డి ఏవిధంగా గెలిచింది.. అలాగే ఆమె పార్టీ కోసం కష్టపడిన తీరును అనసూయ పాత్ర ద్వారా యాత్ర సినిమలో చూపించనున్నారని తెలుస్తుంది. ఎప్పుడూ గ్లామర్ తో వెలిగిపోయే అనసూయ యాత్ర సినిమాలో డీగ్లామరైజ్డ్ గా కనిపించనుంది. మరి రంగస్థలంలో రంగమ్మత్తగా డీగ్లామరైజ్డ్ గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు యాత్రలో కూడా అలానే మరిపిస్తుందన్నమాట.

Tags:    

Similar News