పుష్ప లో అనసూయ కేరెక్టర్ అదేనా?

జబర్దస్త్ యాంకర్ గా అనసూయ కి ఎనలేని క్రేజ్. హాట్ యాంకరింగ్ కి కొత్తర్ధం చెప్పిన భామ అనసూయ. అటు సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్తానం [more]

Update: 2020-08-11 11:29 GMT

జబర్దస్త్ యాంకర్ గా అనసూయ కి ఎనలేని క్రేజ్. హాట్ యాంకరింగ్ కి కొత్తర్ధం చెప్పిన భామ అనసూయ. అటు సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్తానం సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ అలాగే ఈటీవీలో ప్రతి రోజు పండగే షో లోను, జీ తెలుగులో ప్రోగ్రామ్స్ కి జెడ్జి గా ను యమా బిజీ. అయితే అనసూయని వెండితెర మీద రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి పాత్ర ఇచ్చాడు దర్శకుడు సుకుమర్. ఆ సినిమాలో అనసూయ నడివయస్కురాలిగా అదరగొట్టేసింది. అయితే తాజాగా అనసూయ కి సుకుమర్ పుష్ప సినిమాలోనుగా ఆదిరిపోయే పాత్ర ఇచ్చాడనే న్యూస్ అల్లు అర్జున్ పుష్ప సినిమా అనుకున్నప్పటినుండి ప్రచారం జరుగుతుంది.

అయితే అనసూయ బందిపోటు రాణిగా కనిపించనుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అనసూయ పుష్పాలో చెయ్యబోయే కేరెక్టర్ పై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది పుష్ప సినిమాలో అనసూయ దృష్టి లోపం ఉన్న మహిళగా కనబడనుందని.. ఈ పాత్ర సినిమాలో కీలకం అంటున్నారు. అందుకే ఈ లాక్ డౌన్ లో అనసూయ పుష్ప సినిమాలో చేసే పాత్రలో నటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ.. చేయాల్సిన హోమ్ వర్క్‌ చేసే పనిలో ఉందట. మరోపక్క కృష్ణ వంశి కూడా రంగమార్తాండ లో అనసూయ కి సినిమాకే హైలెట్ అనే పాత్ర ఇచ్చాడు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తుందిఆ ని సమాచారం.

Tags:    

Similar News