హీరోయిన్ తో సమానమైన పాత్రా..?

చిరు – కొరటాల శివ సినిమా ఈ జూన్ నుండి కానీ ఆగష్టు నుండి కానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ [more]

Update: 2019-05-07 08:26 GMT

చిరు – కొరటాల శివ సినిమా ఈ జూన్ నుండి కానీ ఆగష్టు నుండి కానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసుకుని కూర్చున్న కొరటాల శివ.. చిరు సరసన నటించే హీరోయిన్ దగ్గర నుండి సినిమాలో నటించే నటీనటుల ఎంపిక చెప్పట్టాడనే న్యూస్ ఉంది. ఇక చిరు సరసన ఇంకా హీరోయిన్ ని అయితే పరిచయం చెయ్యలేదు కానీ.. ఈ సినిమాలో మరో కీ రోల్ ప్లే చేయబోతున్న అనసూయ విషయం మాత్రం సోషల్ మీడియాలో కథలు కథలుగా వినబడుతుంది. అనసూయ చిరు – కొరటాల శివ మూవీలో ఓ కీలక పాత్ర చేయబోతోందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం లాంటి సినిమాల‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిరూపించుకున్న అనసూయ ఇపుడు చిరు సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుందో అనే క్యూరియాసిటీ ఉంది.

మ‌రో రంగ‌మ‌త్త‌గా…

ఇక ఈ సినిమా కోసం అక్షరాలా 25 లక్షలు అందుకుంటున్న అనసూయ… ఈ సినిమాలో హీరోయిన్ తో సమానమైన పాత్రను చెయ్యబోతుందనేది లేటెస్ట్ న్యూస్. చిరు – కొరటాల సినిమాలో అనసూయకు హీరోయిన్‌తో సమానమైన పాత్రను ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ కూడా అనసూయ పాత్రను సరికొత్తగా డిజైన్ చేసినట్టు సమాచారం. మరి రంగస్థలం సినిమాలో రంగమ్మత్త లాంటి మరో పాత్ర అనసూయకి పడితే ఆమె కెరీర్ లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మరి రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఎంత కీలకమో కొరటాల శివ – చిరు సినిమాలో అనసూయ పాత్ర అంతే కీలకమంటూ ప్రచారమైతే జోరుగా జరుగుతుంది.

Tags:    

Similar News