హైపర్ ఆది స్కిట్ లో లేకపోతే బాధపడుతుందట!!

జబర్దస్త్ లో హైపర్ ఆది తన స్కిట్స్ కోసం వారానికో అమ్మాయిని తీసుకురావడం స్కిట్స్ లో పంచ్ డైలాగ్స్ తో బెస్ట్ స్కిట్ గా 10 కి [more]

Update: 2020-10-13 07:55 GMT

జబర్దస్త్ లో హైపర్ ఆది తన స్కిట్స్ కోసం వారానికో అమ్మాయిని తీసుకురావడం స్కిట్స్ లో పంచ్ డైలాగ్స్ తో బెస్ట్ స్కిట్ గా 10 కి 10 ఎగేరేసుకుపోవడం హైపర్ ఆది స్టయిల్. ప్రతి వారం ఓ కొత్తమ్మాయితో స్కిట్స్ ని లేపే ఆది గతంలో చాల వారాలు వరసగా యాంకర్ అనసూయ తో కలిసి తన స్కిట్స్ లో డాన్స్ స్టెప్స్ వేసి అందరిని ఉత్సాహపరిచేవాడు. అనసూయ మీద పంచ్ లు వేసినా అనసూయ కూడా స్పోర్టివ్ గా తీసుకునేది. అనసూయ తో ఆది చాలా స్కిట్స్ లో డాన్స్, పెరఫార్మెన్స్ చేసి స్కిట్స్ కొట్టిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఈ మధ్యన అనసూయని పెద్దగా తన పక్కన పెట్టుకోవడం లేదు ఆది.

కారణం తెలియదు కానీ..  ఆది స్కిట్ లో తనకి కంఫర్ట్ ఉంటుంది అని.. అందరిపై ఆది వేసే పంచ్ లు సామాన్యమైనవి కావని, ఫెమస్ సెలబ్రిటీస్ దగ్గరనుండి, రాజకీయనాయకులు ఇలా ఎవరిని వదలకుండా హైపర్ ఆది అదిరిపోయే పంచ్ లు రాసుకుంటాడని, ఇక తాను కూడా గతంలో హైపర్ ఆది స్కిట్స్  నటించింది కూడా స్కిట్ ప్రకారమే అంటుంది హాట్ యాంకర్ అనసూయ. ఒక్కోసారి హైపర్ ఆది టీం లో నేను లేనా అని డిస్పాయింట్ అవుతా అంటుంది అనసూయ, మా మధ్యన స్కిట్స్ కి సంబందించిన రిలేషన్ ఉంది కానీ… అందరూ అనుకున్నట్టుగా మామధ్యన ఏం లేదని… అవన్నీ కొట్టి అబద్దాలే అంటూ కొట్టి పారేసింది. మరి హైపర్ ఆది స్కిట్ లో అనసూయ ఉండేలా ప్లాన్ చెయ్యవయ్యా.. మేము కూడా అనసూయ పెరఫార్మెన్సు చూడాలిగా అంటూ ఆమె అభిమానులు ఆది కి మెస్సేజ్ లు పెడుతున్నారు.

Tags:    

Similar News