అనసూయ కావాలంటున్న హీరో?

ప్రస్తుతం బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా అనసూయ అవకాశాల జోరు మాములుగా లేదు. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ విడుదలకు సిద్ధమవుతుంటే కృష్ణవంశీ [more]

Update: 2020-12-30 09:38 GMT

ప్రస్తుతం బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా అనసూయ అవకాశాల జోరు మాములుగా లేదు. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ విడుదలకు సిద్ధమవుతుంటే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాకుండా రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ రవితేజ తో పాటుగా ఢీ అంటే ఢీ అనే కీలకపాత్రలో నటించబోతుంది. ప్రస్తుతం ఖిలాడీ సినిమా సెట్స్ మీదుంది. అలాగే అనసూయ పుష్ప సినిమాలోనూ ఓ పాత్ర చేయబోతుంది అనే టాక్ కూడా ఉంది.

తాజాగా మహేష్ సర్కారు వారి పాటలో ఓ పాత్ర కి  అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. ఈ హాట్ యాంకర్ అనసూయ కోసం ఓ మంచి పాత్రని డిజైన్ చేసాడట దర్శకుడు. దర్శకుడు పరశురామ్ మహేష్ కోసం ప్రత్యేకమైన కామెడీ ఎపిసోడ్ ఒకటి డిజైన్ చేసాడని.. ఆ ఎపిసోడ్ లోనే అనసూయ నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మరి అనసూయ అందాలను ఏ ఒక్క హీరో వదలడం లేదు. అందుకే తమ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలను అనసూయ కోసం సృష్టిస్తున్నారు దర్శకులు.

Tags:    

Similar News