అనసూయ బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా..?

బుల్లితెరలో జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని టీవీ షోస్ తో ఫుల్ బిజీ గా ఉన్న ప్రముఖ యాంకర్ అనసూయ రీసెంట్ గా రామ్ చరణ్ ‘రంగస్థలం’ [more]

Update: 2019-04-26 06:13 GMT

బుల్లితెరలో జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని టీవీ షోస్ తో ఫుల్ బిజీ గా ఉన్న ప్రముఖ యాంకర్ అనసూయ రీసెంట్ గా రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో నటించి అందరిని ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత కొని చిన్న సినిమాల్లో చిన్న రోల్స్ చేసినా అనసూయ లేటెస్ట్ గా మెగా స్టార్ చిరంజీవి సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసిందని గట్టిగా టాక్ విపిస్తుంది. ‘సైరా’లో కాదులేండి. చిరు నెక్స్ట్ మూవీ కొరటాల సినిమాలో ఓ రోల్ చేయనుంది అనసూయ.

కొరటాల సినిమాలో…

కొరటాల – చిరు కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ పాత్ర కోసం డైరెక్టర్ కొరటాల ఆమె సంప్రదించాడట. కథ విన్న వెంటనే అనసూయ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చిరు సినిమాలో అవకాశం కావడం, తన పాత్ర కథానాయిక పాత్రకు సమానంగా ఉండటంతో ఆమె ఓకే చెప్పిందని టాక్. పైగా పెద్ద మూవీ కావడం విశేషం. ‘సైరా’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News