ఈ కోయల అప్పుడే కూసేస్తుందా?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే కి అదృష్టం అలా అలా కలిసొస్తుంది. బాలీవుడ్ లో సినిమాల్తో ఇప్పుడిప్పుడే హైలెట్ అవుతున్న ఈ భామ ఫ్యాషన్ షోస్ [more]

Update: 2020-02-28 05:00 GMT

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే కి అదృష్టం అలా అలా కలిసొస్తుంది. బాలీవుడ్ లో సినిమాల్తో ఇప్పుడిప్పుడే హైలెట్ అవుతున్న ఈ భామ ఫ్యాషన్ షోస్ లో, అవార్డు ఫంక్షన్స్ లో అదరగొట్టేస్తున్న అనన్య పాండే గ్లామర్ తో చంపేస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిం తో క్రేజీ హీరోయిన్ అయ్యింది. అనన్య పాండే ఇంటర్వూస్ కోసం, అలాగే ఆమెతో కలిసి ముచ్చటించేందుకు మీడియా కూడా ఆత్రం చూపిస్తుంది. అనన్య పాండే ఇప్పటికే విజయ్ దేవరకొండ ని తెగ పొగిడేసింది. ఇప్పుడు ఈ సినిమాలో తన రోల్ పై కూడా రివీల్ చేసేసింది.

పూరి జగన్నాధ్- విజయ్ దేవరకొండ సినిమాలో పాత్ర తన రియల్ లైఫ్‌కు ఎంతో దగ్గరగా ఉంటుంది అని… ఎంతో తెలివైన, అందమైన అమ్మాయిలకు నా పాత్రతో సంబంధముంటుందని అనుకుంటుందట. అంతేకాదు ఇప్పటికే అనన్య పాండే తెలుగు నేర్చుకుంటుందట. సెట్స్ లో విజయ్ దేవరకొండ చెబుతుంటే తెలుగు చిన్న చిన్న పదాలు నేర్చుకుంటుందట. మరి పాన్ ఇండియా మూవీ కాబట్టి. ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తా అంటుంది. మరి నిన్నగాక మొన్న తెలుగు తో పాన్ ఇండియా ఫిలిం సెట్స్ మీదకెళ్ళిందో లేదో…అప్పుడే డబ్బింగ్ ముచ్చట్లు కూడా మట్లాడుతుంది ఈ కోయిలమ్మ

Tags:    

Similar News