అప్పుడే పొగడడం స్టార్ట్ చేసిందా?

బాలీవుడ్ భామలంతా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ స్టయిల్ ని తెగ పొగుడుతున్న విషయం అందరికి తెలిసిందే. జాన్వీ కపూర్ నుండి అలియా భట్ వరకు [more]

Update: 2020-02-26 06:44 GMT

బాలీవుడ్ భామలంతా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ స్టయిల్ ని తెగ పొగుడుతున్న విషయం అందరికి తెలిసిందే. జాన్వీ కపూర్ నుండి అలియా భట్ వరకు అందరూ విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగుడుతుంటే.. విజయదేవరకొండ క్రేజ్ ఎల్లలు దాటింది అనుకున్నారు. అందుకే విజయ్ దేవరకొండ కూడా తన క్రేజ్ బాలీవుడ్ లో భారీగా ఉందనుకుని పూరి జగన్నాధ్ సినిమాని పాన్ ఇండియా ఫిలిం గా మార్చేశాడు. ఇక జాన్వీ కపూర్ విజయ్ స్టయిల్, అర్జున్ రెడ్డి మూవీ బాగా నచ్చింది అని.. అతని తో సినిమా చేసందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నా అంది. అలియా భట్ కూడా రౌడీ ఇమేజ్ అర్జున్ రెడ్డి స్టయిల్ అన్ని నచ్చాయంది.

తాజాగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే కూడా విజయ్ దేవరకొండ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కే సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ భామకి విజయ్ సరసన ఛాన్స్ రావడం గొప్ప విషయమే. అనన్య పాండే హాట్ నెస్ గురించి ఎంత పొగిడినా తక్కువే. అయితే సెట్స్ లో విజయ్ దేవరకొండ ఎలా ఉంటాడో.. అని భయపడిన తనకి విజయ్ చాలా మంచి వ్యక్తి అని, చాలా స్మార్ట్ అని చెబుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కేరెక్టర్ గురించి చాలామంది కాంట్రవర్సీ చేసారు కానీ.. నేను విజయ్ తో అర్జున్ రెడ్డి గురించి మాట్లాడలేదు. కానీ అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ సూపర్ అనడమే కాదు.. అలాంటి పాత్ర పోషించినంత మాత్రాన నిజ జీవితంలోనూ మనుషులు అలాగే ఉంటారని అనుకోవడం పొరపాటు అని చెబుతుంది ఈ భామ. ఇక విజయ్ చాలా మంచోడని, చాలా స్మార్ట్ అని, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి అంటూ విజయ్ ని పొగడ్తలతో ముంచి లేపుతుంది.

Tags:    

Similar News