స్టార్ కిడ్స్ కి చుక్కలే.. ఇంకేం సాక్ష్యం కావాలి!!

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చుక్కలు కనబడుతున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తో సినీ వారసులను సుశాంత్ అభిమానులు ఆడుకుంటున్నారు. [more]

Update: 2020-08-29 07:22 GMT

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చుక్కలు కనబడుతున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తో సినీ వారసులను సుశాంత్ అభిమానులు ఆడుకుంటున్నారు. సుశాంత్ ఆత్మహత్య తో వాళ్ళకి సంబంధం లేకపోయినా.. బాలీవుడ్ నేపాటిజం పై సుశాంత్ అభిమానులు కక్ష కట్టారు. అందుకే స్టార్ కిడ్స్ నటించితిన్ సినిమాలకు చుక్కలు చూపెడుతున్నారు. అలియా భట్ సడక్ 2  ట్రైలర్ కి రికార్డు స్థాయిలో డిస్ లైక్స్ కొట్టిన సుశాంత్ అభిమానులు.. బాలీవుడ్ ప్రేక్షకులు.. ఇప్పుడు మరో స్టార్ కిడ్ అనన్య పాండే మీద పడ్డారు. మొన్నటికి మొన్న జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా పై తీవ్రంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అనన్య పాండే నటించిన ఖలీ పీలీ ట్రైలర్ కి రికార్డు స్థాయిలో డిస్ లైక్స్ బారిన పడేటట్లు చేసారు. 

మా అమ్మాయి స్టార్ కిడ్ కాదు.. నేను స్టార్ ని కాదు అని అనన్య పాండే తండ్రి చుంకీ పాండే కామెడీ చేసినా సుశాంత్ అభిమానులు మాత్రం అనన్య సినిమాకి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు. ఇకపై జాన్వీ కానీ, అలియా కానీ, సోనాక్షి కానీ, సారా కానీ, అనన్య కానీ ఎవ్వరి సినిమాలైనా సుశాంత్ అభిమానులు ఇదే రీతిలో ప్రవర్తించేలా కనబడుతున్నారు. సుశాంత్ సింగ్ మరణానికి నేపోటిజం కారణమా? లేదంటే రియా చక్రవర్తి కారణం? అనేది తెలిసేవరకు సుశాంత్ సింగ్ అభిమానుల తీసు అలానే ఉంటుంది. మరి సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు ఆగ్రహ జ్వాలలో ఇలా ఎవ్వరైనా మాడి మసైపోవాల్సిందే అంటుంటే.. బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం ఈ కేసులో మరింత వేడి రాజుకుంది. 

Tags:    

Similar News