అనన్య కి ఇష్టమైన హీరోలు?

బాలీవుడ్ లేత అందాల అనన్య పాండే కి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చూసాక విజయ్ తో కలిసి పనిచేస్తే బావుంటుంది అనుకుంటే.. ఏకంగా విజయ్ పక్కన [more]

Update: 2020-12-06 02:49 GMT

బాలీవుడ్ లేత అందాల అనన్య పాండే కి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చూసాక విజయ్ తో కలిసి పనిచేస్తే బావుంటుంది అనుకుంటే.. ఏకంగా విజయ్ పక్కన పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం అంటుంది. పూరి అండ్ ఛార్మిలతో కలిసి పని చేస్తుంటే.. కొత్తవాళ్లతో పని చేస్తున్న ఫీలింగ్ కలగలేదంటుంది. ఇక తాను సినిమాల్లోకి వచ్చి కొద్దికాలమే అయినా..తన కోసం ప్రాణమిచ్చే అభిమానులు చూస్తే హ్యాపీగా ఉంటుందట అనన్యకి. తనకి చిన్నప్పటినుండి బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అంటుంది అనన్య. బహుశా నా వయసున్న అమ్మాయిలందరికి హ్రితిక్ అంటే ఇష్టం ఉండకుండా ఉండదు.. హృతిక్ అంటే యూనివర్సల్ క్రష్ ఏమో.. అంతబావుంటాడు హ్రితిక్ రోషన్.

కానీ అనన్య పాండే సినిమాల్లో మాత్రం హ్రితిక్ పక్కన నటించడం కన్నా మరో యంగ్ హీరో వరుణ్ పక్కన నటించడం అంటే ఇష్టం అంటుంది. హృతిక్ ఇష్టమే కానీ.. సినిమాల్లో నటించడానికి కాదట.. సినిమాలంటే వరుణ్ ధవన్ పక్కనే అని తెగేసి చెబుతుంది అనన్య పాండే. ఇంకా ఫైటర్ నిర్మాత ఛార్మి గురించి మట్లాడుతూ ఛార్మి చాలా మంచిది అని.. నాకు కథ చెప్పడానికి వచ్చినపపుడు మీ చెవి రింగ్స్ బావున్నాయనగానే తన చెవుల రింగ్స్ తీసి నాకిచ్చేసిందింది అంత మంచిది ఛార్మి అంటూ అనన్య ఛార్మిని పొగిడేస్తోంది. 

Tags:    

Similar News