విజయ్ తమ్ముడు స్పీడ్ ఉన్నాడే..!

టాలీవుడ్ యూత్ ఐకాన్ సక్సెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిన విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ [more]

Update: 2019-05-22 10:17 GMT

టాలీవుడ్ యూత్ ఐకాన్ సక్సెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిన విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఇదే ఛాన్స్ అనుకున్న విజయ్ తన సొంత తమ్ముడిని హీరోగా పరిచయం చేసాడు. విజయ్ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా హీరో అయిపోయాడు. 'దొర‌సాని'తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అసలు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయిందో ఎవరికీ తెలియదు కానీ కంప్లీట్ అయిపోయింది. ఈ శుక్ర‌వారం ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేస్తున్నారు.

ఫ్లాప్ డైరెక్టర్ తో

ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో ఛాన్స్ కొట్టేసాడు ఆనంద్. మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌తోనే మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడిప్పుడు. ఈ చిత్రానికి ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. నారా రోహిత్ తో సావిత్రి అనే సినిమా తీసి పరాజయం అందుకున్న పవన్ సాధినేని చాలాకాలం తరువాత తన మూడో సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. విజయ్ తమ్ముడు కాబట్టి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమా ఛాన్స్ వచ్చింది అదే వేరే హీరో అయితే నానా తిప్పలు పడేవారు.

Tags:    

Similar News