అన్న క్రేజ్ చూసి కొన్నారా ఏంటి?

టాలీవుడ్ లోనే కాదు..బాలీవుడ్ లోను విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. టాలీవుడ్ లో తనదైన మ్యానరిజం తో స్టార్ హీరోస్ పక్కన చేరిన విజయ్ దేవరకొండ [more]

Update: 2020-10-13 07:01 GMT

టాలీవుడ్ లోనే కాదు..బాలీవుడ్ లోను విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. టాలీవుడ్ లో తనదైన మ్యానరిజం తో స్టార్ హీరోస్ పక్కన చేరిన విజయ్ దేవరకొండ తన ప్రత్యేకమైన స్టయిల్ తో బాలీవుడ్ సీలెబ్రిటీస్ కి నచ్చే హీరోగా మారాడు. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టయిల్ కి పడి చచ్చే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ క్రేజ్ ని చూసి వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ని ఓటిటి ప్లేట్ ఫామ్ వారు కొన్నారేమో అనిపించక మానదు. కారణం విజయ్ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ రాజశేఖర్ కూతురు శివాని తో కలిసి దొరసాని సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా అటు ఇటుగా ఆడింది కానీ.. హిట్ అయితే అవ్వలేదు.

ఇక ఆనంద్ దేవరకొండ సెకండ్ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ షూటింగ్ పూర్తయ్యి.. థియేటర్స్ ప్రోబ్లెంస్ తో ఓటిటికి చేరింది. అన్ని సినిమాల వలే మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటిటిలో విడుదలయితే ఓకె. కానీ ఇక్కడ ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ని అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి కొనుగోలు చేసింది అనే టాకే కాస్తా సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే మీడియం రేంజ్ సినిమానే ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా. అయితే లో బడ్జెట్ మూవీ గనక అమెజాన్ కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసింది అనుకుంటే పొరబాటే. ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ని ఏకంగా 4.5 కోట్లకి అమెజాన్ ప్రైమ్ వారు కొనేశారట. 

ఆ లో బడ్జెట్ సినిమాకి ఈ రేంజ్ ఆఫర్ రావడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. మరి ఆనంద్ అన్న విజయ్ క్రేజ్ చూసి అమెజాన్ అంత పెట్టింది అనుకుంటే పొరబాటే. ఎందుకంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసిన అమెజాన్ సంస్థ వారు ఆ సినిమాకి ఆ రేంజ్ రేటు పెట్టారట. అంటే సినిమా బావుంది అని అనుకున్నాకే ఆ రేటు పెట్టి సినిమాని దక్కించుకున్నారు. మరి అమెజాన్ ప్రైమ్ లో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఈ నెల 20 న విడుదల కాబోతుంది.

Tags:    

Similar News