సినిమా బ్లాక్ బస్టర్.. కానీ..

Update: 2018-12-01 04:46 GMT

శంకర్ 'ఐ' చిత్రంలో నటించి '2.0'లో ఛాన్స్ కొట్టేసింది ఏమీ జాక్సన్‌. 'ఐ' చిత్రం చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమా చేయకూడదని కండిషన్ పెట్టి ఆమె తో అగ్రిమెంట్ చేయించుకున్నాడు శంకర్. శంకర్ సినిమా కదా మంచి పేరు గుర్తింపు వస్తది అని ఆశించి ఏ సినిమా ఒప్పుకోకుండా ఆలా కాలక్షేపం చేసింది ఈ బ్రిటిష్‌ సుందరి. అయితే ఈసినిమా నిరాశపరచడంతో ఆమెకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు శంకర్.

'2.0' లో ఏమీ జాక్సన్‌ కు అవకాశం ఇచ్చాడు. ఈసినిమాతో అన్న బ్రేక్ వస్తుందేమో అని ఆశపడి ఒప్పుకుంది. ఆడ రోబోగా నటించడం వల్ల ఏమీకి గ్లామరస్‌గా కనిపించే వీలు చిక్కలేదు. ఒక సాంగ్ లో నటించినప్పటికీ ఆమె అందాలు అన్ని కవర్ చేసుకోవడంతో తన ఫ్యాన్స్ నిరాశ చెందారు. సినిమాలో అక్కడక్కడా కనిపించే పాత్ర లో నటించింది ఏమీ జాక్సన్.

సినిమా మొత్తం రజిని - అక్షయ్ చుట్టూ తిరగడంతో ఈమెకు అవకాశం లేకుండా పోయింది. ఈ చిత్రం తో జాతకం మారిపోతుందనే నమ్మకంతో ఉన్న అది జరిగేలా కనిపించడంలేదు. ఈమెకు ఆఫర్స్ రావాలంటే త్వరగా గ్లామర్ కి స్కోప్ ఉన్న సినిమాలో నటిస్తే తరువాత పెద్ద సినిమాల్లో అవకాశం వస్తుంది. లేకపోతే అప్పటివరకు ఖాళీగా కూర్చోవాల్సిందే.

Similar News