`అమ్మ‌మ్మ‌గారిల్లు` అద్భుతహ...!

Update: 2018-05-30 04:12 GMT

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో కె.ఆర్ స‌హా నిర్మాత‌గా రాజేష్ నిర్మించిన‌ ‘అమ్మమ్మగారిల్లు’ శుక్ర‌వారం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో యూనిట్ గ్రాండ్ స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

నాగశౌర్య‌నే ప్ర‌ధాన కార‌ణం..

న‌టుడు రావు ర‌మేష్ మాట్లాడుతూ.. 'అన్ని పాత్ర‌లు సినిమాలో పండాయి. సినిమా బాగుంది అన‌డాని కి ప్ర‌ధాన కార‌ణం నాగ‌శౌర్య‌. ఆ త‌ర్వాత‌ సుధ‌, శివాజీ రాజా పాత్ర‌లు. లాక్ యువ‌ర్ ఏజ్ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఆ పాత్ర‌ల్లో అంతా ఇన్వాల్స్ అయి న‌టించారు కాబ‌ట్టే ఇంత మంచి పేరు వ‌చ్చింది. 2008 నుంచి 2018 వ‌ర‌కూ ప్ర‌తీ రోజు నాకు గుర్తిండిపోతుంది. నా అనుభ‌వాల‌ను ఇత‌రుల‌తో షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ప‌దేళ్లు నా లాక్ ఏజ్. ఇలాంటి సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చినందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని అన్నారు.

నా ప‌న్నెండేళ్ల క‌ల‌...

ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ..' ఇంత మంది సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో ఎలా చేయాలి చాలా టెన్ష‌న్ ప‌డ్డా. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వ‌చ్చాను. ఇప్పుడు వాళ్ల‌నే నేను డైరెక్ట్ చేసాను. వండ‌ర్ ఫుల్ మూవ్ మెంట్ ఇది. నేను త‌ర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్న‌ది తెలియ‌దు. నా ప‌న్నెండు ఏళ్ల క‌ల ఈ సినిమా తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ప‌ర్వాలేదు. ఇదొక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఈ ఏడాదిన్న‌ర నా లాక్ ఏజ్. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని అన్నారు.న‌టుడు శివాజీ రాజా మాట్లాడుతూ..' రాజేష్, కుమార్, సుంద‌ర్ చాలా మంచి వ్య‌క్తులు. వీళ్లు ఇంకా మంచి సినిమాలు చేయాలి. మంచి హిట్లు కొట్టాలి. తెలుగు ఇండ‌స్టీలో వాళ్ల ముద్ర ప‌డిపోవాలి. నా 45 ఏళ్ల ప‌గ ఈ మ‌ధ్య‌నే తీరింది. అదే నా లాక్ ఏజ్' అని అన్నారు.

Similar News