అమ్మడు బాగా తెలివైందే..

Update: 2018-06-08 09:06 GMT

అమీ జాక్సన్ నటించిన 2.ఓ సినిమా ఎపుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియదు గాని.. అమ్మడు కి ఆ సినిమా మీద పెద్దగా ఆశలు లేవేమో అనిపిస్తుంది. 2.ఓ సినిమా తరవాత మరే సినిమా జోలికి వేళ్ళని అమీ జాక్సన్ ఆ మధ్యలో సినిమాల నుండి తప్పుకుని లండన్ లో సెటిల్ అవుతుందనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టని ఈ లండన్ బ్యూటీ తన బ్యూటీ మీద బాగా కాన్సంట్రేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో పిచ్చ యాక్టీవ్ గా వుండే అమీ జాక్సన్ ప్రస్తుతం బికినీ ఫోజులో అదరగొడుతుంది.

సినిమా అవకాశాలు వచ్చినా....

నీలి కళ్ళ సుందరి నీలి రంగు బికినీ లో మెరిసిపోతుంది. చిన్న పీలికల్లాంటి బ్లూ బికినీలో అమీ జాక్సన్ అలా కూర్చుని చూస్తూ ఉంటే కుర్రకారు గుండె లయ తప్పడం ఖాయం గా కనబడుతుంది. మరి ఇంత అందాన్ని మనం సినిమాల్లో ఆస్వాదించలేకపోతున్నామనే బాధ మాత్రం చాలా వుంది. అయితే అమీ కి సినిమా అవకాశాలు రాక కాదు... వచ్చిన అవకాశాలను ఒప్పుకోకుండా అమీ జాక్సన్ కాస్త యాటిట్యూడ్ చూపిస్తుందని అనే వారు లేకపోలేదు. మరి అమ్మడుకి సినిమాల మీదకన్నా బాయ్ ఫ్రెండ్ మీదే మనసు ఎక్కువగా ఉన్నట్లుంది.

మరిచిపోకూడదని ఫోటో షూట్స్..

మరి అమీ జాక్సన్ విదేశీ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నా.... అమ్మడు మాత్రం వాటి గురించి స్పందించడం లేదు. మరి అమ్మడు 2.ఓ విడుదలయ్యాక అది గనక బంపర్ హిట్ అయితే సినిమాల్లోకి వస్తుందేమో. లేదంటే సినిమాలను లైట్ తీసుకుని... హ్యాపీగా సెటిల్ అవుతుందో అనేది మాత్రం అస్సలు క్లారిటీ రావడం లేదు. కానీ అమీ మాత్రం చాలా తెలివైన హీరోయిన్. తన సినిమాలెలాగూ ప్రస్తుతం ప్రేక్షకులకు చేరువయ్యేలా లేవు.. ఈలోపు తనని మరిచిపోకూడదని.. ఇలా బికినీ ఫోటో షూట్స్ తో అందరిని కైపెక్కిస్తుంది.

Similar News