ఎట్టకేలకు యుఎస్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది..!

Update: 2018-08-06 07:11 GMT

మూడు నెలలు కిందట వచ్చిన 'మహానటి' సినిమా తప్ప అమెరికా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా అంతగా ఆడలేకపోయాయి. మొన్న వచ్చిన సుధీర్ బాబు చిత్రం ‘సమ్మోహనం’ ఓ మోస్తరుగా ఆడినా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన ‘ఆర్ఎక్స్ 100’ సైతం యుఎస్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

దూసుకుపోతున్న గూఢచారి

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అడివి శేష్ ‘గూఢచారి’ సినిమాతో అమెరికా తెలుగు బాక్సాఫీస్‌ కళకళలాడుతుంది. ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ శనివారానికే 3 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. ఓవర్ అల్ గా ఫుల్ రన్ లో ఈ సినిమా ముప్పావు మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ చెబుతున్నారు.

చి.ల.సౌ కు కూడా మంచి వసూళ్లు

ఈ సినిమా 6 కోట్లతో తెరకెక్కింది. మంచి టాక్ తో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తో పాటు తొలి వారాంతంలోనే ఈ చిత్రం పెట్టుబడిని వెనక్కి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా మొన్న రిలీజ్ అయిన 'చి ల సౌ’ సైతం అమెరికాలో బాగానే ఆడుతోంది. ఈ చిత్రం లక్ష డాలర్ల మార్కును దాటింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన ఇంకో సినిమా ‘బ్రాండ్ బాబు’ మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక వచ్చే వారం రిలీజ్ అయ్యే ‘శ్రీనివాస కళ్యాణం’, ‘విశ్వరూపం’ సినిమాలకు అమెరికాలో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

Similar News