అమీర్ స్పీడుకి బ్రేకులేసింది..!

Update: 2018-11-10 06:52 GMT

పీకే, దంగల్ చిత్రాలతో సూపర్ రికార్డులను క్రియేట్ చేసిన అమీర్ ఖాన్... స్టార్ హీరోలందరిలో ఒకడుగు ముందే ఉన్నాడు. బాహుబలి వచ్చేవరకు అమీర్ ఖాన్ మీదున్న రికార్డులను ఎవరూ కొల్లగొట్టలేకపోయారు. టాలీవుడ్ లో నిర్మితమైన బాహుబలి బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకి నెట్టేసింది. బాహుబలి బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రికార్డులు తుడిచిపెట్టేసింది. కానీ అమీర్ ఖాన్ దంగల్ చిత్రం మాత్రం చైనా వంటి దేశంలో రికార్డులు పదిలంగానే ఉన్నాయి. పీకే, దంగల్ చిత్రాలైతే పలు జాతీయ అవార్డులను తమ రికార్డుల ఖాతాలో వేసుకున్నాయి.

ఫ్లాప్ టాక్ రావడంతో...

అలాంటి రికార్డుల హీరో ఇప్పుడు థగ్స్ అఫ్ హిందుస్థాన్ ప్లాప్ తో బోర్లా పడ్డాడు. థగ్స్ అఫ్ హిందుస్థాన్ గురువారం విడుదలైంది. చెత్త రివ్యూస్ తో థగ్స్ అఫ్ హిందుస్థాన్ అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మొదటి రోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తన నటనతో చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినా వీక్ స్టోరీ, డైరెక్షన్ లో ఉన్న పలు లోపాల కారణంగా ఈ థగ్స్ అఫ్ హిందుస్థాన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

చాలా రోజు తర్వాత పరాజయం...

ప్రేక్షకులు తిరస్కరించిన ఈ సినిమాతో చాలా రోజుల తరువాత అమీర్ ఖాన్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ కలక్షన్లపరంగా రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోయిన అమీర్ ఖాన్ కి థగ్స్ అఫ్ హిందుస్థాన్ బ్రేకులు వేసింది. ఇక ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలేమి బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేయలేకపోయాయి. కానీ స్టార్ హీరోయిన్స్ దీపికా పద్మవత్, రాజి చిత్రాలు మాత్రం బాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ మూవీస్ గా సంచలనాలు సృష్టించాయి.

Similar News