అమీర్ ఖాన్ గుడ్ బై చెప్పేస్తాడంట..!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటుడే కాదు మంచి డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. ఇతని డైరెక్షన్ లో తారే జమీన్ పర్ అనే సినిమా [more]

Update: 2019-03-18 08:03 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటుడే కాదు మంచి డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. ఇతని డైరెక్షన్ లో తారే జమీన్ పర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. అలానే తన నిర్మాణంలో లగాన్, దంగల్, తారే జమీన్ పర్ లు వంటి మంచి సినిమాలు నిర్మించాడు. తారే జమీన్ పర్ తరువాత అమీర్ ఇంతవరకు డైరెక్షన్ చేయలేదు.

నటనకు గుడ్ బై చెప్పి…

అయితే తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టాడు. మళ్లీ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు అని అడిగిన ప్రశ్నకు అమీర్ ఇలా బదులిచ్చాడు. ‘‘డైరెక్షన్ అనేది నా కల, నా కోరిక. కచ్చితంగా మళ్లీ దర్శకుడిగా మారతాను. అయితే దర్శకత్వం చెయ్యాలి అని నిర్ణయించుకునే ముందే.. ఇక నటనకు గుడ్ బై చెప్పేస్తాను’’అని అమిర్ చెప్పుకొచ్చాడు. మరి అమీర్ ఖాన్ ఎప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News