విజయ్ సినిమా నుండి అమలా పాల్ అవుట్!

తమిళ విలక్ష నటుడు విజయ్‌ సేతుపతి తన 33 వ చిత్రం ని కూడా ప్రకటించేసారు. ఈమూవీని ఎస్పీ జననాథన్‌ శిష్యుడు వెంకట్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. [more]

Update: 2019-06-26 17:37 GMT

తమిళ విలక్ష నటుడు విజయ్‌ సేతుపతి తన 33 వ చిత్రం ని కూడా ప్రకటించేసారు. ఈమూవీని ఎస్పీ జననాథన్‌ శిష్యుడు వెంకట్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమాను అధికారంగా ప్రకటించారు మేకర్స్. ఇక ఇందులో ‘తడయరతాక్క’, ‘తడం’ ఫేమ్‌ మగిళ్‌తిరుమేని ఈ చిత్రంలో విలన్‌గా నటించినట్లు ప్రకటించారు.

అలానే హీరోయిన్ గా అమలా పాల్ ని తీసుకుంద్దాం అని డిసైడ్ అయ్యారు. ఆమె కథ విని మొదట ఓకే కూడా చెప్పింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుండి అమలాపాల్‌ తప్పుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్లేస్ లో మేఘ ఆకాశ్‌ను ఎంపింక చేసినట్లు సమాచారం.

అమలా పాల్ ఈమూవీ నుండి తప్పుకోవడానికి కారణం ముందు ఒప్పుకున్నప్పుడు అడిగిన రెమ్యూనరేషన్‌ కన్నా ఇప్పుడు ఎక్కువగా అడగడంతోపాటు పలు షరతులు కూడా ఆమె పెట్టినట్లు వినికిడి. దానికి ప్రొడ్యూసర్స్ నో చెప్పడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని సమాచారం. ఇక ఈమూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదట షెడ్యూల్ ఊటీలో స్టార్ట్ కానుంది.

Tags:    

Similar News