అమలా పాల్ మూవీ గురించి ట్వీట్ చేసిన సామ్!

తమిళ నటి అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన  సస్పెన్స్ థ్రిల్లర్ “ఆడై” ఫస్ట్ తోనే మూవీ పై అంచనాలు పెంచేసింది. రత్న కుమార్ డైరెక్ట్ చేస్తున్న [more]

Update: 2019-06-19 09:05 GMT

తమిళ నటి అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఆడై” ఫస్ట్ తోనే మూవీ పై అంచనాలు పెంచేసింది. రత్న కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా నుండి నిన్న టీజర్ రిలీజ్ అయింది. నిమిషం పైనే ఉన్న ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. టీజర్ లో అమలా ఒక షాట్ లో పూర్తిగా నగ్నంగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

పాత్ర కోసం అమలా ఎటువంటి పాత్ర అయినా చేస్తుందని చెప్పకనే చెబుతుంది. ఇక ఈ టీజర్ కు సినీ ప్రముఖుల నుండి అలాగే,ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. అలానే నటి సమంత కూడా ఈ టీజర్ గురించి ట్వీట్ చేసింది. ” ఈ మూవీ టీజర్ అత్యంత ఉత్కంఠ కలింగించేలా, అద్భుతంగా ఉంది, బెస్ట్ విషెస్ టు అమలా పాల్, ఈ మూవీ కోసం నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.

ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News