ధనుష్ కి ఏం తెలియదంటున్న హీరోయిన్?

అమల పాల్ కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడే దర్శకుడు కె. ఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వాళ్ళ ప్రేమ, పెళ్లి [more]

Update: 2020-02-18 09:32 GMT

అమల పాల్ కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడే దర్శకుడు కె. ఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వాళ్ళ ప్రేమ, పెళ్లి అన్ని చాల త్వరగానే బ్రేకప్ అయ్యి విడాకులు తీసుకుందీ జంట. అయితే అప్పట్లో అమల పాల్ విడాకులకు కారణం ఆమె ఫ్రెండ్ హీరో ధనుష్ అనే ప్రచారం జరిగింది. కానీ విజయ్ – అమల ఆ విషయంపై ఎక్కడా నోరు విప్పలేదు. కానీ.. అమలాపాల్ మాజీ భర్త విజయ్ తండ్రి తాజాగా అమల పాల్ విడాకులకు కారణం హీరో ధనుష్ అని.. ధనుష్ వలనే తమ కొడుకు కోడలు విడిపోయారని తీవ్రమయిన ఆరోపణలు చేసాడు.

అమల పెళ్లి తర్వాత నటించకూడదని అనుకుంది అని.. కానీ ధనుష్ మాత్రం తన స్వీయ నిర్మాణంలో అమ్మ కనక్కు సినిమా మొదలెట్టి.. అమల పాల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోవడం… అమల కూడా ధనుష్ చెప్పాడని.. పెళ్లి తర్వాత నటించకూడదనే నియమాన్ని బ్రేక్ చేసి సినిమా ఒప్పుకోవడంతో.. విజయ్ – అమల మధ్యన విభేదాలొచ్చి అమల పాల్ విడాకులు కోరుకుంది అని చెప్పాడు. కానీ అమల పాల్ మాత్రం తన విడాకులకు ధనుష్ కి సంబంధం లేదని అంటుంది. ధనుష్ తనకి మంచి ఫ్రెండ్ అని.. తన విడాకుల విషయంలో ధనుష్ ఇన్వాల్మెంట్ ఏం లేదని అమల పాల్ కుండబద్దలు కొడుతోంది. నా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని.. ఇక మీద నా విడాకుల విషయం ఎక్కడా మాట్లాడాలనుకోవడం లేదని.. చెబుతుంది

Tags:    

Similar News