ఇప్పట్లో తేల్చేలా లేరుగా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా [more]

Update: 2019-03-02 09:36 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వాలి కానీ కొన్ని కారణాలు వల్ల పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తోంది. కారణం త్రివిక్రమ్ చెప్పిన కథలో బన్నీ కొన్ని మార్పులు చెప్పాడట. ఆ మార్పులు చేసి త్రివిక్రమ్ బన్నీకి వినిపించినా బన్నీ దానికి కన్విన్స్ కాలేకపోతున్నాడట. అందుకే బన్నీ లేట్ అయినా పర్లేదు స్క్రిప్ట్ లో మార్పులు చేయమని కోరాడట.

వీరి కాంబోపై మంచి అంచనాలు

అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా టైం పట్టేలా ఉందని చెబుతున్నారు. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విజయం సాధించడంతో ఈ సినిమాపైన కూడా అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇందులో బన్నీ కొంచం డిఫరెంట్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు.

Tags:    

Similar News