శిరీష్ పరిస్థితి ఇలా అయిందేంటి..?

మెగా హీరోలందరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ డం సంపాదించుకున్నారు. ఇక వరుణ్ తేజ్ అయితే యావరేజ్ హిట్స్ కొడుతూ కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. [more]

Update: 2019-05-18 06:31 GMT

మెగా హీరోలందరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ డం సంపాదించుకున్నారు. ఇక వరుణ్ తేజ్ అయితే యావరేజ్ హిట్స్ కొడుతూ కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. మరో హీరో సాయి ధరమ్ తేజ్ వరుస ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరితో యావరేజ్ హిట్ కొట్టాడు. కానీ మరో మెగా హీరో అల్లు శిరీష్ మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా సతమతమవుతూనే ఉన్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి సినిమాలు అల్లు శిరీష్ కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. మరి ఎలాగైనా హిట్ కొట్టి స్టార్ రేంజ్ కి చేరాలని అనుకుని ఈసారి సేఫ్ సైడ్ గా ఒక మలయాళీ సినిమాని తెలుగులో కొత్త దర్శకుడితో రీమేక్ చేసాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాని తెలుగులో రీమేక్ చేసాడు. ఆ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఒరిజినల్ వెర్షన్ ని యాజిటీజ్ గా తెరకెక్కించకుండా దర్శకుడు, అల్లు శిరీష్ కలిసి తెలుగు ప్రేక్షకుల కొసమే కొన్ని సీన్స్ యాడ్ చెయ్యడంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అలా సినిమా విడుదల లేట్ అయ్యింది.

అన్నీ మైనస్ లే

అయితే తీరా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఏబీసీడీ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకు ఘోరమైన టాక్ ఇస్తే క్రిటిక్స్ మాత్రం కాస్త యావరేజ్ మార్కులేశారు. ఏబీసీడీ మలయాళ సినిమాని సరిగ్గా అర్ధం చేసుకోకుండా దర్శకుడు తెలుగులో రీమేక్ చేసాడనిపిస్తుంది. కథలో, కథనంలో బలం లేకపోవడం, మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉండడం, సినిమా కాస్టింగ్ కూడా సినిమాకి మెయిన్ మైనస్, అలాగే నిర్మాణ విలువలు కూడా చీప్ గా అనిపించాయి. ఇక సినిమాకు హీరోయిన్ కావాలి కాబట్టి, ఏదో ఒక ట్రాక్ రాయాలి కాబట్టి రాసారు. అంతకు మించి హీరోయిన్ గా చేసిన రుస్కర్ కి ప్రాధాన్యత లేదు. అల్లు శిరీష్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తప్ప సినిమాలో మరో ప్లస్ పాయింట్ లేదంటే ఏబీసీడీ ఫలితమెలా ఉందో చెప్పొచ్చు. మరి రీమేక్ తో హిట్ కొడదామనుకుని అల్లు శిరీష్ చేతులు కాల్చుకున్నట్టే కనబడుతుంది.

Tags:    

Similar News