అందరినీ మార్చేస్తున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నిటిలోనూ తల దూర్చుతాడని టాక్ ఉంది. ప్రస్తుతం అతను చేస్తున్న తమిళ రీమేక్ ఏబీసీడీ వ్యవహారం కూడా అలానే [more]

Update: 2019-03-07 10:17 GMT

అల్లు శిరీష్ చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నిటిలోనూ తల దూర్చుతాడని టాక్ ఉంది. ప్రస్తుతం అతను చేస్తున్న తమిళ రీమేక్ ఏబీసీడీ వ్యవహారం కూడా అలానే ఉంది. ఈ సినిమా కోసం పని చేస్తున్న టెక్నీషియన్ ను కంటిన్యూగా ఉంచుతున్నట్లు లేదు. ఈ సినిమా స్టార్టింగ్ లో సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్ కే నాయుడును అనుకున్నారు కానీ సినిమా స్టార్ట్ అయిన తరువాత అతని ప్లేస్ లో మరొకరు వచ్చారు. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా మార్చేసినట్టు టాక్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కన్నడ నుండి ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుని వచ్చాడు శిరీష్.

అందరినీ మార్చుకుంటూ…

అయితే ఇప్పుడు రీ రికార్డింగ్ ను వేరే వాళ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అలానే మధ్యలో ఎడిటర్ ని కూడా మార్చేసినట్టు టాక్. ఇవి కాకుండా చివరికి తన టీమ్ ను కూడా మార్చినట్లు తెలుస్తోంది. శిరీష్ మొదటి సినిమా నుండి అత్యంత సన్నిహితమైన పీఆర్ టీమ్ ఉండగా.. ఇప్పుడు కొత్తవారిని తీసుకున్నట్టు వినికిడి. చేసేదే తక్కువ సినిమాలు.. అందులో ఈ మార్పులు చేర్పులు ఏంటో? ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్లు అరవింద్ ఏబీసీడీ సినిమా చూసారు కానీ ఆయన స్పందన ఏమిటన్నది ఇంకా తెలియలేదు. మార్చి మూడో వారం ఈ సినిమా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News