అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్

నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ మిలటరీ లుక్ కోసం హెయిర్ స్టయిల్ దగ్గరనుండి అన్ని చేంజ్ చేసాడు. మిలటరీ ఆఫీసర్ కి ఉండాల్సిన లుక్ [more]

Update: 2019-06-11 08:03 GMT

నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ మిలటరీ లుక్ కోసం హెయిర్ స్టయిల్ దగ్గరనుండి అన్ని చేంజ్ చేసాడు. మిలటరీ ఆఫీసర్ కి ఉండాల్సిన లుక్ అంతా అల్లు అర్జున్ బాడీలోనే కనబడింది. అయితే ఆ లుక్ కాస్త డిఫ్రెంట్ గా ఉన్నప్పటికీ.. ఆ లుక్ లో అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అయితే తర్వాత ఒక ఏడాది సినిమాల నుండి గ్యాప్ తీసుకున్న బన్నీ అప్పుడప్పుడు హెయిర్ బాగా పెంచేసి తలకి హెయిర్ బ్యాండ్ పెట్టుకుని కాస్త డిఫ్రెంట్ గా కనిపించేసరికి… బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో కనిపించబోయే న్యూ లుక్ ఇదే అంటూ చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ సినిమాలో హీరోస్ ఎవరైనా నీట్ గా సాఫ్ట్ లుక్ లోనే కనబడతారు. అసలు రఫ్ లుక్ లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.

అయితే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని.. కొద్దిపాటి గ్యాప్ తో సెకండ్ షెడ్యూల్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొదలెట్టేసారు. శరవేగంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందో… తెలిసిపోయింది. చాలా సాఫ్ట్ లుక్ లో అల్లు అర్జున్ బుద్దివంతుడిలా మేడలో ఐడి కార్డు తో చాలా సాఫ్ట్ అండ్ కూల్ గా కనిపిస్తున్నాడు. మరి అల్లు అర్జున్ లుక్ అలా సోషల్ మీడియాలో లీక్ అయిందో లేదో ఇలా వైరల్ అయ్యింది. మరి ఫ్యామిలీ సంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి నేను నాన్న, అలకనంద అనే టైటిల్ వాడుకలో ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ మాత్రం సాఫ్ట్ అండ్ కూల్ లుక్ తో ఇరగదీసేస్తాడు. మరి పూజ హెగ్డే తో రెండోసారి రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్… మరో కథానాయక నివేత పేరు రాజుతోను జోడి కడుతున్నాడు.

Tags:    

Similar News