అల్లు అర్జున్ ఎక్కడా?

అందరూ కరొనతో ఖాళీగా కనబడుతూ సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఎన్నడూ సోషల్ మీడియా వైపు చూడని చిరు కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసాడు. [more]

Update: 2020-03-27 05:23 GMT

అందరూ కరొనతో ఖాళీగా కనబడుతూ సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఎన్నడూ సోషల్ మీడియా వైపు చూడని చిరు కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసాడు. చిరు ఆలా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాడో లేదో.. ఇలా సినిమా ప్రముఖులంతా ఆయనకు స్వాగతం పలికారు. చిన్న పెద్ద హీరోలంతా చిరుకి ఆత్మీయ స్వాగతం పలికినా మెగా హీరో.. చిరు గారి ముద్దుల మేనల్లుడు అల్లు అర్జున్ మాత్రం చిరుకి విషెస్ చెప్పలేదు దానితో మెగా ఫాన్స్ రెచ్చిపోయారు. అల్లు అర్జున్ ఎక్కడ బాబు అంటూ ఆడుకోవడంతో బన్నీ నెక్స్ట్ డే చిరుకి స్వాగతం చెప్పాడు. ఇక కరోనా తో అతలాకుతలం అయిన రెండు రాష్ట్రాలకు స్టార్ హీరోస్ అంతా తమ వంతు సహాయం అందిస్తున్నారు.

ప్రభాస్, మహేష్, పవన్ , రామ్ చరణ్, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా భారీగా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. అందరూ చేతనైనంత సహాయం చేస్తుంటే.. అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్ కానీ ఎక్కడా చడీ చప్పుడు లేదు. హీరోలంతా పోటీ పడుతూ విరాళాలు ప్రకటించగా అల్లు అర్జున్ కామ్ గా వున్నాడు. దానితో మెగా ఫాన్స్ మాత్రమే కాదు…. ఇతర ఫాన్స్ కూడా అల్లు అర్జున్ ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. పెద్ద షూటింగ్స్ తో బిజీ అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం ఎందుకు.ప్రస్తుతం అందరూ కరోనా తో ఖాళీనేగా.. అల్లు అర్జున్ ఇలా చెయ్యడం బాగోలేదు అంటున్నారు.

Tags:    

Similar News