అసలు బన్నీ - విక్రమ్ సినిమా ఉంటుందా..?

Update: 2018-10-26 07:49 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ అయ్యి విక్రమ్ కుమార్ ను పక్కన పెట్టేసాడు. నిజానికి విక్రమ్ తో సినిమాకు సంబంధించి చాలా వరకు వర్క్ కంప్లీట్ అయింది. అయితే అల్లు అర్జున్ కు సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవడంతో మార్చి తీసుకుని రమ్మన్నాడు. విక్రమ్ సెకండ్ హాఫ్ ను మార్చి అల్లు అర్జున్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. అందుకే విక్రమ్ బన్నీకి బోదులు వేరే హీరోని చూసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.

వీరి కాంబినేషన్ పక్కా...

అయితే అది ఏమి లేదని బన్నీ సన్నిహితులు చెబుతున్నారు. విక్రమ్ తో బన్నీ సినిమా తప్పకుండ ఉంటుందని చెబుతున్నారు. అల్లు అర్జున్... విక్రమ్ కు ఫోన్ చేసి సెకండాఫ్ ఎంతవరకూ వచ్చిందని తరచూ అడుగుతూనే ఉన్నాడట. అంటే ఈ కాంబినేషన్ లో సినిమా తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. త్రివిక్రమ్ సినిమా తరువాత బన్నీ లింగుస్వామితో చేయవచ్చని సమాచారం.

Similar News