మారుతిని బంతాట ఆడుతున్న బన్నీ

Update: 2018-12-12 08:07 GMT

దర్శకుడు మారుతికి అల్లు అర్జున్ తో మంచి స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని ఎలాగైనా వాడుకోవాలని మారుతీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాలనేది మారుతి కోరిక. అయితే అల్లు అర్జున్ కి కూడా మారుతిపై భలే భలే మగాడివోయ్ సినిమా దగ్గరనుండి గురి ఉంది కానీ... మంచి కథ ప్రిపేర్ చేస్తే సినిమా చేస్తానని మాటిచ్చిన.. అల్లు అర్జున్ కి సరిపోయే కథను మాత్రం మారుతి సెట్ చెయ్యలేకపోతున్నాడు. తాజాగా విక్రమ్ కుమార్ తో సినిమా అని.. మళ్ళీ త్రివిక్రమ్ కి కనెక్ట్ అయిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా సెట్ కాకపోతే మారుతితోనే చేద్దామనుకున్నాడట. ఇక శైలజ రెడ్డి అల్లుడు తర్వాత మారుతి కూడా అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని.. బన్నీకి కథ రాస్తూన్నాడట.

ఎలాగూ త్రివిక్రమ్ తో ఒక కథ కుదిరి.. మళ్ళీ ఆ రీమేక్ కథ త్రివిక్రమ్ చెయ్యనని... అనేసరికి బన్నీ - త్రివిక్రమ్ కాంబో ఆగిపోయినల్టుగా వార్తలొచ్చాయి. ఈలోపు మారుతి బన్నీని కలవగా మంచి కథ చూడు చేద్దామని చెప్పడంతో.. ఆవేశంగా మారుతి, అల్లు అర్జున్ కోసం అదిరిపోయే కథని రాసుకునే పనిలో పడ్డాడట. కానీ ఈ లోపు ఆ రీమేక్ చెయ్యనన్న త్రివిక్రమ్ ఫ్రెష్ కథతో బన్నీ ని ఒప్పించడం జరగగా.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ అతి త్వరలోనే పట్టలేకబోతుందట. మరి మారుతి ఏమో అల్లు అర్జున్ కోసం కథ ప్రిపరేషన్ లో ఉండి.. బన్నీని మెప్పించి ప్రస్తుతం ఖాళీ గా ఉన్న బన్నీ ని ఇంప్రెస్స్ చేసి సినిమా చెయ్యాలనుకుంటే మధ్యలో త్రివిక్రమ్, మారుతికి నిద్ర లేకుండా చేస్తుంటే..బన్నీ కూడా మారుతిని పక్కనబెట్టి త్రివిక్రమ్ తో సినిమాకి సిద్దమవుతున్నాడట.

ఇక మారుతీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది కానీ అది ఎపుడో అనేది మారుతికి కూడా తెలియదు. ఎందుకంటే అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్లాప్ తర్వాత ఎలాంటి ఛాయస్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే మారుతి ని అటూ ఇటు కాకుండా బంతాట ఆడుతున్నాడు బన్నీ అంటున్నారు మారుతీ సన్నిహితులు. మరి త్రివిక్రమ్ సినిమా తర్వాత అయినా అల్లు అర్జున్ మారుతికి అవకాశమా ఇస్తాడో లేదో అనేది మారుతి అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది.

Similar News