అల్లు అర్జున్ టైటిల్ ఏమిటి చెప్మా?

దర్శకుడిగా త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ లో ఎంతో అర్ధం పరమార్ధం దాగి ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ చాలా కొత్తగా సరికొత్తగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ [more]

Update: 2019-08-14 06:17 GMT

దర్శకుడిగా త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ లో ఎంతో అర్ధం పరమార్ధం దాగి ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ చాలా కొత్తగా సరికొత్తగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. ఇప్పటికే షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఆరు నెలలు అల్లు అర్జున్ కొత్త సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్న త్రివిక్రమ్ ఆ సినిమాని గత ఏప్రిల్ లో మొదలు పెట్టాడు. మొదలు పెట్టిందే తడువు షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు ఓ కీ రోల్ పోషిస్తుంది.

అయితే సినిమా షూటింగ్ మొదలై ఐదు నెలలు గడుస్తున్నా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చెయ్యలేదు. అయితే రేపు ఆగష్టు 15 న అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ బయటికి రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలెట్టినపుడే… త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా టైటిల్ ‘నేను నాన్న’ అని కాదు ‘అలకనంద’ అంటూ మరో టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అయితే మూవీ టీం ఈ టైటిల్ విషయ స్పందించకపోయేసరికి త్రివిక్రమ్ కొత్త సినిమా పేరు ‘అలకనంద’ గా ఫిక్స్ అయ్యారు అభిమానులు. అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అదే ‘వైకుంఠపురంలో’ అనే టైటిల్ అల్లు అర్జున్ 19 కి పెట్టబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ‘నేను నాన్న, అలకనంద, వైకుంఠపురంలో’ టైటిల్స్ లో అల్లు అర్జున్ న్యూ మూవీ టైటిల్ ఏమిటనేది రేపు ఈపాటికి తేలిపోతుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూస్తూన్నారు.

Tags:    

Similar News