బన్నీ – త్రివిక్రమ్ మూవీ కథ ఇదేనట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ [more]

Update: 2019-05-20 08:12 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా నుండి కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎమోషన్ ని కాస్త ఎక్కువగానే ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈసారి కూడా బన్నీ సినిమాలో ఎమోషన్ నే హైలెట్ చేస్తూ.. బన్నీ కోసం మంచి సిస్టర్ సెంటిమెంట్ కథ రాశాడట. రెగ్యులర్ సినిమాల మాదిరిగా రెండు, మూడు సీన్స్ రాసుకుని వాటిని డెప్త్ డైలాగ్ లతో పండించడం కాకుండా కథ మొత్తం చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా రాసుకున్నాడని టాక్ నడుస్తుంది.

సిస్టర్ సెంటిమెంట్ తో

అయితే ఇందులో సిస్టర్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రివిక్రమ్ బన్నీని కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడని సమాచారం. అందుకే బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి హెయిర్ స్టైల్ వరకు కొత్త బన్నీ కనిపించేలా త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. బన్నీ సరసన పూజ రెండోసారి నటిస్తుంది. ఇందులో సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బన్నీ తల్లి పాత్రలో టబు తొలిసారిగా నటిస్తుంది.

Tags:    

Similar News