త్రివిక్రమ్ ని తక్కువ అంచనా వేసిన బన్నీ

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. కొన్ని రోజులు కిందట రిలీజ్ ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. [more]

Update: 2019-08-22 08:25 GMT

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. కొన్ని రోజులు కిందట రిలీజ్ ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బన్నీ ఒకవైపు ఈచిత్రం షూటింగ్ లో బిజీగా ఉంటూనే వేరే దర్శకులతో మంతనాలు జరుపుతూ వుండడం..ఇది సెట్స్ మీద ఉండగానే మరొకటి స్టార్ట్ చేస్తా అనడం మన చూస్తూనే వచ్చాం.

కానీ రీసెంట్ గా రిలీజ్ అయినా ‘అల వైకుంఠపురము’ టీజర్ తో త్రివిక్రమ్ తనదైన శైలి మార్క్ ని కనబరిచారు. టీజర్‌లో త్రివిక్రమ్‌ తన చమత్కారం చూపించడంతో అల్లు అర్జునుడు ఫిదా అయ్యాడు. త్రివిక్రమ్ లో ఇంకా పస తగ్గలేదని గ్రహించి ఈసినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు.అసలే ఈమూవీ సంక్రాంతి రేస్ లో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’తో పోటీ పడుతోంది కనుక అల్లాటప్పా సినిమా ఇస్తే సరిపోదు అని భావించి త్రివిక్రమ్ పై ఒత్తిడి తగ్గించి అతనికి వీలయినంత సమయాన్ని ఇచ్చి మంచి అవుట్‌పుట్‌ తెచ్చుకోవాలని డిసైడ్‌ అయ్యాడు.

అందుకే సుకుమార్ తో కూడా నేను ఇప్పుడే సినిమా చేయలేను, త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయినా తరువాతే సినిమా చేస్తా అని చెప్పేశాడట. అసలే సుకుమార్ మూవీలో బన్నీ ది కొత్త లుక్.

Tags:    

Similar News