అరవింద సమేత హిట్ పై అతని డెసిషన్ ఆధారపడి ఉంది

Update: 2018-09-21 03:09 GMT

త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. మాటల మాంత్రికుడి సినిమాలకు బోలెడంతమంది అభిమానులున్నారు. చిన్న హీరో తో సినిమా చేసినా, వేరే భాష సినిమాలను కాపీ చేసి సినిమా చేసినా... త్రివిక్రమ్ డైలాగు, కామెడీ టైం కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి దర్శకుడు పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ తో కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అందుకున్నాడు. త్రివిక్రమ్ - పవన్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన అజ్ఞాతవాసి భారీ అంచల నడుమ విడుదలై అట్టర్ ప్లాప్ అవడంతో.. త్రివిక్రమ్ తో సినిమాలు చెయ్యాలనుకున్న స్టార్ హీరోలలో కొంతమంది మొహం చాటేశారనే టాక్ నడిచింది.

అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని త్రివిక్రం స్టయిల్ అంటే... కామెడీ ఎంటెర్టైనెర్ గాను, ఎన్టీఆర్ స్టైల్ అంటే మాస్ మసాలతోను రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈసినిమా పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదలై ఎన్టీఆర్ ఫాన్స్ నే కాదు.. సాధారణ ప్రేక్షకులను ఒక ఊపు ఊపుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అరవింద సమేత మరో 20 రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పబ్లిసిటీని మొదలు పెట్టిన టీం ఈ సినిమా మీద గట్టి నమ్మకమే పెట్టుకుంది. అయితే అరవింద సమేత రిజల్ట్ కోసం ఒక స్టార్ హీరో కాచుకుని కూర్చున్నాడట. అతనెవరో కాదు నా పేరు సూర్య తో డిజాస్టర్ అందుకుని.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చెయ్యడానికి బోలెడంత టైం తీసుకున్న అల్లు అర్జున్.

అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతున్నప్పటికీ... బన్నీకి మాత్రం త్రివిక్రమ్ మీద చూపు ఉందట. అయితే త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తర్వాత వెంకటేష్ సినిమా లైన్ లో ఉంది. కానీ త్రివిక్రమ్ మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ మహేష్ కోసం ట్రై చేస్తున్నాడనే టాక్ ఉంది. అయితే అల్లు అర్జున్ కి మాత్రం త్రివిక్రమ్ మీదే గురి ఉందట. అందుకే త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత రిజల్ట్ కోసం వెయిట్ చేసి సినిమా హిట్ అనుకుంటే.. వెంటనే త్రివిక్రమ్ ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సెట్ చేసే పనిలో ఉన్నాడట. అందుకే ఇన్నాళ్లుగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి అరవింద సమేత హిట్ అయితే త్రివిక్రమ్ కి బన్నీ దొరుకుతాడు. లేదంటే.. చివరికి విక్రమ్ కుమార్ దిక్కవుతాడో చూడాలి.

Similar News