ఇప్పటిదాకా తీసుకున్న రెస్ట్ చాలు… ఇక నో రెస్ట్

అల్లు అర్జున్ తన పాత సినిమాకి కొత్త సినిమాకి ఏడాది పైగా గ్యాప్ తీసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలెట్టిన అల్లు అర్జున్… త్రివిక్రంతో [more]

Update: 2019-05-26 16:38 GMT

అల్లు అర్జున్ తన పాత సినిమాకి కొత్త సినిమాకి ఏడాది పైగా గ్యాప్ తీసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలెట్టిన అల్లు అర్జున్… త్రివిక్రంతో కలిసి ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసి ఫ్యామిలీతో వేసవి వెకేషన్స్ కి విదేశాలకు చెక్కేసాడు. అయితే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ విషయంలో మాత్రం నో రెస్ట్ అంటున్నారు. అంటే ఇప్పటివరకు తీసుకున్న రెస్ట్ చాలు… ఇక నో రెస్ట్ అన్నట్టుగా వుంది త్రివిక్రమ్ – అల్లు అర్జున్ వ్యవహారం కనబడుతుంది.

స్క్రిప్ట్ కోసం ఆరు నెలల టైం తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం యమ స్పీడు మీద సినిమా షూటింగ్ చేస్తున్నాడు. రేపు 29 నుండి ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మే 29 నుండి దాదాపుగా ఓ 30 రోజుల పాటు అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో ప్లాన్ చేశారట. ఈ భారీ షెడ్యూల్ లోనే సినిమా లోని 20 నుండి 30 శాతం పార్ట్ ని ఫినిష్ చేసే విధంగా టీం రెడీ అవుతుందట. ఇక ఈ భారీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ సినిమాలో ఎంపికైన టాప్ మోస్ట్ నటులంతా పాల్గొంటారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎంత త్వరగా ఫినిష్ అయితే అంట త్వరగా అల్లు అర్జున్ సుకుమార్ అండ్ వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ ని పట్టాలెక్కించాలి.

Tags:    

Similar News