షాకింగ్ “96” రీమేక్ లో స్టార్ హీరో

Update: 2018-11-17 04:29 GMT

తమిళంలో బ్లాక్ బాస్టర్ అయిన “96” గురించి తెలుగులోనూ మాట్లాడుకుంటున్నారు. విజయ్ సేతుపతి..త్రిష జంటగా నటించిన ఈసినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చాలా మంది నిర్మాతలు లైన్ లో ఉన్నారు. అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం ఈసినిమా యొక్క తెలుగు రైట్స్ ఎప్పుడో కొనేశారు అని తెలిసింది.

ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈసినిమా దిల్ రాజు.. రానా - త్రిష లతో తీద్దాం అని డిసైడ్ అయ్యారు. కానీ రీసెంట్ గా ఈసినిమా ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూసి ఫిదా అయి ఎట్టిపరిస్థిల్లో ఈసినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ గట్టి గా ఫిక్స్ అయ్యాడట. ఇది ఇలా ఉంటె అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఎప్పటినుండో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.

త్రివిక్రమ్ కొన్ని లైన్స్ చెప్పినా అవి బన్నీ కి నచ్చకపోడంతో ఈసినిమాను రీమేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అని ఫిలింనగర్ సమాచారం. తమిళ వెర్షన్ “96” లో విజయ్ అండ్ త్రిష లు తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. మరి బన్నీ తెలుగులో తగిన న్యాయం చేస్తాడో లేదో చూడాలి. అసలు ఈసినిమాను దిల్ రాజు.. బన్నీ తో తీయడానికి ఇష్టపడతాడో లేదో కూడా చూడాలి

Similar News