బన్నీ – సుక్కు మూవీ ఏ బ్యాక్ డ్రాప్ లోనో తెలుసా?

రంగస్థలం లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత డైరెక్టర్ సుకుమార్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ ఎవరితోనో అనౌన్స్ చేయలేదు. రంగస్థలం తరువాత సుకుమార్ మహేష్ [more]

Update: 2019-08-02 06:08 GMT

రంగస్థలం లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత డైరెక్టర్ సుకుమార్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ ఎవరితోనో అనౌన్స్ చేయలేదు. రంగస్థలం తరువాత సుకుమార్ మహేష్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు కానీ మహేష్ లేట్ చేయడంతో అల్లు అర్జున్ వైపు షిఫ్ట్ అయిపోయాడు.

అల్లు అర్జున్ కోసం చాలా కథలు రాసుకుని చివరికి ఓ కథను ఫైనల్ చేసుకున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం. సౌత్ ఇండియాలో ని దట్టమైన అడవుల్లో చిత్రీకరణను ప్లాన్ చేశారట. అయితే సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఏంటో మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఇక ఈమూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. నవంబర్ నుండి స్టార్ట్ అయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

Tags:    

Similar News