సుక్కూ తో వాదిస్తున్న అల్లు అర్జున్?

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ నుండి ఇంకా బయటికొచ్చినట్లుగా అనిపించడం లేదు. నిన్నటివరకు అల వైకుంఠపురములో సక్సెస్ సెకెబ్రేషన్స్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ [more]

Update: 2020-02-08 07:40 GMT

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ నుండి ఇంకా బయటికొచ్చినట్లుగా అనిపించడం లేదు. నిన్నటివరకు అల వైకుంఠపురములో సక్సెస్ సెకెబ్రేషన్స్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ నిన్న ఫ్యామిలీతో కలిసి తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అయితే సుక్కూ సినిమా కోసం అల్లు అర్జున్ గెటప్ మార్చి సెట్స్ మీదకెళ్తాడు అనుకుంటే.. తాజాగా రెండు నెలల గ్యాప్ లో అల్లు అర్జున్ సుక్కూ కోసం రెడీ అవుతాడని తెలుస్తుంది. అయితే ఇప్పడు సుక్కుతో అల్లు అర్జున్ కొత్త సినిమా విషయంలో కొన్ని మార్పులు సూచిస్తున్నాడని, ఆది కూడా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అల్లు అర్జున్ థమన్ వైవు మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు.

అల వైకుంఠపురములో కోసం తన కెరీర్ ఉత్తమ మ్యూజిక్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ తమన్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని.. అందుకే దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో #AA20 కోసం తమన్ ని పరిగణలోకి తీసుకోవాలని బన్నీ సుకుమార్‌ను కోరినట్లు సమాచారం. కానీ సుకుమార్ ఆర్య నుండి దేవిశ్రీ తో కలిసి పనిచేస్తున్నాడు. సుక్కూ – దేవి మధ్యన చాలా మంచి అనుబంధం ఉంది. మరి నిజం చెప్పాలంటే రంగస్థలం కోసం దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సంచలనాత్మకమైనది. కానీ ఈమధ్యలో దేవిశ్రీ థమన్ ముందు డల్ అవడంతో.. అల్లు అర్జున్ దేవి ప్లేస్ లోకి థమన్ ని తీసుకుంటే బావుంటుంది అని సుకుమార్ తో వాదిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి అల్లు అర్జున్ వెర్షన్ కరక్ట్, అలాగే సుక్కూ వెర్షన్ కరెక్ట్. ఫైనల్ గా సుక్కూ అల్లు అర్జున్ చెప్పినదానికి ఏం అంటాడో చూడాలి.

Tags:    

Similar News