అల్లు అర్జునేమో గానీ... రవితేజ ఆఫర్ ఇచ్చాడు..!

Update: 2018-10-31 09:52 GMT

ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టిన తర్వాత ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుట్ బాగా బిజీ తారగా మారుతుందనుకున్నారు అంటా. అయితే ఆర్ఎక్స్ 100లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన పాయల్ రాజ్ పుట్ కు అదే తరహా పాత్రలు రావడంతో.. హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుందుకు ఆ పాత్రలకు నో చెప్పిందనే టాక్ నడిచింది. అయితే పాయల్ స్టార్ హీరోల సరాసన ఏమో గానీ కనీసం మీడియం రేంజ్ హీరోల సరసన కూడా ఛాన్స్ లు రాలేదు. అదిగో బెల్లంకొండ మూవీలో పాయల్ అన్నారు. ఇదిగో చరణ్ సినిమా ఐటెం సాంగ్ కి నో చెప్పిన పాయల్ అన్నారు.. కానీ ఎక్కడా క్లారిటీ లేదు.

ముగ్గురిలో ఒక హీరోయిన్ గా...

తాజాగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో మూవీలో పాయల్ పేరు వినిపించింది. కానీ అల్లు అర్జున్ సినిమాలో పాయల్ కి ఛాన్స్ ఏమో గానీ.. రవితేజ కొత్త సినిమాలో మాత్రం పాయల్ రాజ్ పుట్ వన్ అఫ్ ది హీరోయిన్ గా ఎంపికైంది. రవితేజ - వీఐ ఆనంద్ కలయికలో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాలో పాయల్ రవితేజకి జోడిగా ఎంపికైంది. ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో రవితేజ డ్యూల్ రోల్ లో కనబడనున్నాడు. అయితే ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ ను ఎంపిక చేశారు. ఇక తాజాగా మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుట్ ని తీసుకున్నారని సమాచారం. అయితే రవితేజ - వీఐ ఆనంద్ ల డిస్కో రాజా చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Similar News