బన్నీ అంత చేసినా... మనసులో పెట్టుకోని చెర్రీ!!

Update: 2018-04-24 12:00 GMT

రామ్ చరణ్ రంగస్థలం తో భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం చిరు, పవన్ తర్వాత మెగా హీరోలందరిలో టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోయాడు. రంగస్థలం హిట్ కి ముందు అల్లు అర్జున్ కాస్త బెటర్ పొజిషన్ లో ఉండేవాడు. అప్పటికి రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్య ఆరోగ్యకరమైన పోటీ జరుగుతుండేది. అయినా ఒకింత అల్లు అర్జున్ టాప్ లో ఉండేవాడు. కానీ రామ్ చరణ్ కి రంగస్థలం హిట్ టాప్ పొజిషన్ కి చేర్చేసింది. స్టార్ హీరోలందరిలో టాప్ పొజిషన్ కి వెళ్ళినట్లే కనబడుతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుత చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన రంగస్థలం లో చిట్టిబాబుగా రామ్ చరణ్ మెరుగైన, కెరీర్ లో బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చ్చాడు. ఇక మెగా ఫాన్స్ కూడా రామ్ చరణ్ కే జై కొట్టేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కూడా తన సినిమాలో ఇప్పటివరకు సేఫ్ జోన్ లోనే ఉన్నాడు.

కొద్దిగా ఒత్తిడిలో.....

అయితే ప్రస్తుతం రంగస్థలం, భరత్ అనే నేను హిట్ కావడంతో కాస్త ఒత్తిడికి లోనవుతున్న అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య కి భారీ హైప్ క్రియేట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. మొన్నటికి మొన్న మహేష్ బాబు భరత్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని పిలిపించి సినిమా మీద క్రేజ్ వచ్చేలా చేసాడు. అయితే అల్లు అర్జున్ బయట హీరోల కంటే తన చిట్టిబాబునే పిలిచి నా పేరు సూర్య కి అదనపు శక్తి తేవాలనుకుంటున్నాడు. మొన్న నా పేరు సూర్య ఆడియో వేడుకల్ని.. మిలట్రీ మాధవరంలో ఆర్మీ జవాన్ల కుటుంబాల మధ్య నిర్వహించారు. కానీ ఇప్పుడు నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ వస్తే బావుంటుందని... చరణ్ ని అర్జున్ రిక్వెస్ట్ చెయ్యగా.. చరణ్ కూడా ఒప్పుకున్నాడట. అలా నా ఆపేరు సూర్య కి గెస్ట్ గా చరణ్ కన్ ఫర్మ్ అయ్యాడు. మరి రామ్ చరణ్ రంగస్థలాన్ని అందరూ చూసి మెచ్చుకున్నాక చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ చూసి మెచ్చుకోవడం అనేది అప్పట్లో బాగా హైలెట్ చేసింది మీడియా. కానీ ఇప్పుడు చరణ్ అవేమి మనసులో పెట్టుకోకుండా బన్నీ సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవగానే వస్తానని చెప్పి సూపర్ అనిపించాడని మెగా ఫాన్స్ లోనే కొందరు మాట్లాడుకుంటున్నారు.

Similar News