అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ కూడా వచ్చేసింది

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ప్రకటించడమే కాదు.. తన సినిమాకి మెగా స్టార్ చిరు అతిధిగా రాబోతున్నట్లుగా అధికారిక [more]

Update: 2019-12-27 11:11 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ప్రకటించడమే కాదు.. తన సినిమాకి మెగా స్టార్ చిరు అతిధిగా రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన ఇప్పించేసి… అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా టీం కి చెక్ పెట్టేసాడు. అంటే అల్లు అర్జున్ మామ చిరు కాబట్టి.. అల్లు అర్జున్ తన అల వైకుంఠపురములో సినిమా ఈవెంట్ కి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అలా మహేష్ త్వరగా చిరు ను గెస్ట్ గా పిలిచేసాడు. జనవరి 5 న సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియం లో కన్ఫర్మ్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ అభిమానులు.. అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ డేట్ కోసం, గెస్ట్ ఎవరో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6 న హైదరాబాద్ లో భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ఇక ముఖ్య అతిధి అంటూ కంఫార్మేషన్ లేకపోయినా.. దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు ఈ ఈవెంట్ కి అతిథిగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి అల్లు అర్జున్ స్పెషల్ గా ఎవరిని గెస్ట్ గా పిలవబోతున్నాడో.. మహేష్ ఈవెంట్ ని తలదన్నేలా అల వైకుంఠపురములో ఈవెంట్ ఉండాలని అల్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక జనవరి 11 న మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5.. ఇక అల వైకుంఠపురములో జనవరి 12 విడుదల.. ప్రీ రిలీజ్ ఈవెంట్ 6 న.. అబ్బా రిలీజ్ డేట్స్ మాత్రమే కాదు.. ప్రీ రిలీజ్ డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి భలేగా ఉన్నాయి.

Tags:    

Similar News