బన్నీకి అలాకి అలా అలా కలిసొస్తుందిగా?

అల్లు అర్జున్ ఈ ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హాట్ అందుకున్నాడు. ఇప్పటివరకు సూపర్ హిట్స్ తోనే సరిపెట్టుకున్న అల్లు అర్జున్ [more]

Update: 2020-02-03 05:32 GMT

అల్లు అర్జున్ ఈ ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హాట్ అందుకున్నాడు. ఇప్పటివరకు సూపర్ హిట్స్ తోనే సరిపెట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టి.. 100 కోట్ల క్లబ్బులోకి వెళ్ళిపోయాడు. అల వైకుంఠపురములో సినిమా రెండు వారాలతోనే సర్దుకుంటుంది అనుకుంటే నాలుగో వారంలోను అలా జోరు ఎక్కడా తగ్గలేదు. అల వైకుంఠపురములో ఉన్న థియేటర్స్ నాలుగో వీకెండ్ లోను ఫుల్ అయ్యాయి అంటే అల జోరు మూడు వారలు దాటినా తగ్గలేదంటే ఆ సినిమా స్టామినా అర్ధమవుతుంది.

ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డ్స్ తో దూసుకుపోతున్న అల వైకుంఠపురములో శని, ఆదివారాల్లో రెండు రోజులూ తెలుగు రాష్ట్రాల్లోని మల్టిప్లెక్స్ లోను హౌస్ ఫుల్స్ పడ్డాయి. గత వారం డిస్కో రాజాకి ఉస్కో టాక్ రావడం… ఈ వారం అశ్వద్ధామకి డివైడ్ టాక్ రావడం అలా వైకుంఠానికి అలాఅలా కలిసొచ్చింది. మరి నిజంగా నాలుగు వారాలు కూడా ఒక సినిమా నిలబడడం మాత్రం ఈరోజుల్లో గొప్పే అని చెప్పాలి. మరి ఇప్పుడు అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అంటూ అల టీం కూడా అలా అలా రెచ్చిపోతుంది.

Tags:    

Similar News