అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడా?

కొత్త ఏడాదిలోకి చప్పగా అడుగుపెట్టేసింది టాలీవుడ్. ఎపుడూ క్రిష్ట్మస్ కి భారీ సినిమాల్తో కళకళలాడే బాక్సాఫీసు ఈ ఏడాది చిన్న సినిమా మత్తువదలరా హిట్ తో ముగించాల్సి [more]

Update: 2020-01-01 07:26 GMT

కొత్త ఏడాదిలోకి చప్పగా అడుగుపెట్టేసింది టాలీవుడ్. ఎపుడూ క్రిష్ట్మస్ కి భారీ సినిమాల్తో కళకళలాడే బాక్సాఫీసు ఈ ఏడాది చిన్న సినిమా మత్తువదలరా హిట్ తో ముగించాల్సి వచ్చింది. అయితే కొత్త ఏడాది మొదలవడం పెద్ద సినిమా జాతరా మొదలవడం ఒకేసారి జరుగుతుంది. ఈ ఏడాది బడా సినిమాల్లో మొదట దర్బార్ తో జనవరి 9 రజిని దిగుతుంటే.. తర్వాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ అంటూ జనవరి 11 న రాబోతున్నాడు. ఇక వెను వెంటనే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జనవరి 12 కి దింపుతున్నాడు. ప్రస్తుతం ఈ సంక్రాంతికి భారీ హైప్ ఉన్న మూవీస్ లో సరిలేరు, అల వైకుంఠపురములో సినిమాలే కనబడుతున్నాయి. అల్లు అర్జున్ అయితే తన సినిమాపై భారీ ధీమాతో కనబడుతున్నాడు.

ఇక జనవరి 12 నే మహేష్ సరిలేరు, అల్లు అర్జున్ ఆలా వైకుంఠం రిలీజ్ డేట్స్ ని మొదట్లో ప్రకటించినా.. హీరోల మధ్యన రహస్య ఒప్పందంతో మహేష్ ముందుకు జరిగి జనవరి 11 కు మారాడు. ఇక జనవరి 11 న సరిలేరు కేవ్వరు భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని హిట్ టాక్ తెచ్చుకుంటే.. అల వైకుంఠపురములో సినిమాని తట్టుకుంటుంది. లేదంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో దున్నేస్తుంది. ఇక అల్లు అర్జున్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో పాటుగా ఆలా వైకుంఠపురములో ఓపెనింగ్స్ ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ తన అల పాటలు లిరికల్ గా ఓ రేంజ్ హిట్ అవడం, టీజర్ ఎక్కేయ్యడం, ఇక వీడియో విజువల్స్ తోనూ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవడంతో.. తన అలా వైకుంఠపురములో సినిమాని జనవరి 10 కి ప్రీ పోన్ చేసుకుంటే… మరిన్ని వసూళ్లు కొల్లగొట్టొచ్చు. సినిమా ఔట్ పుట్ బాగుండటంతో బన్నీ అండ్ టీమ్ రెండు రోజులు ముందుగానే సినిమాని విడుదల చేయాలని, తద్వారా భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చనే ఆలోచనలో ఉన్నారట.

Tags:    

Similar News